రాష్ట్రీయం

రైతులకు పరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి

మడకశిర, నవంబర్ 21: రాష్ట్రంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న అన్ని పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తుఫాన్ వస్తోందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించినా ప్రత్నాయ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. ఫలితంగా తుఫాన్ ప్రభావంతో 40 మంది మృత్యువాత పడ్డారన్నారు. అంతేగాక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, రహదారులు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వరి, వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్ నష్టాన్ని జన్మభూమి కమిటీలతో కాకుండా అధికారులే గ్రామాల్లో పర్యటించి అంచనా వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరవు జాబితాను కేంద్రానికి పంపకపోవడంతో కేంద్ర బృందం పర్యటించలేదన్నారు. కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే కరవు మండలాల జాబితా పంపడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం పరిహారం మంజూరు చేసి రైతులకు అందచేసిందన్నారు. గతంలో హుదూద్ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు రూ.1000 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు పంపకపోవడంతో కేవలం రూ.600 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వేరుశెనగ రైతుకు ఎకరానికి రూ.10 వేలు పరిహారం అందించాలని రఘువీరా డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట దెబ్బతినిందని, ఉభయ గోదావరి జిల్లాల్లో వేరుశెనగ, నెల్లూరు, కడప జిల్లాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రకృతి వైఫరీత్యాల కారణంగా దెబ్బతిన్న అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వరుస తుఫాన్లతో కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని, జాబ్‌కార్డులు ఉన్న కూలీలందరికీ నెల రోజులకు అవసరమైన నిత్యావసరాలను ఉచితంగా అందించాలన్నారు. తుఫాన్ సంభవించిన ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు రఘువీరా చెప్పారు.