జాతీయ వార్తలు

వెనక్కి తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయను * సుప్రీంకోర్టులో రాహుల్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 26: మహాత్మాగాంధీని హత్య చేసింది ఆర్‌ఎస్‌ఎస్సేనంటూ తాను చేసిన ప్రకటనపై విచారం వ్యక్తం చేయాలంటూ సుప్రీంకోర్టు చేసిన సూచనను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తిరస్కరించారు. దీనికి సంబంధించి దాఖలైన పరువు నష్టం దావా కేసును తాను ఎదుర్కొంటానని కూడా ఆయన స్పష్టం చేసారు. దీంతో మహారాష్టల్రోని ఠాణె జిల్లా భివాండీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన బెంచ్ నిర్ణయించింది. పిటిషనర్ (రాహుల్ గాంధీ) విచారం వ్యక్తం చేస్తేనే తాను ఈ వ్యవహారాన్ని ముగిస్తాననిప్రతివాది (ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాకేష్ కుంటే) తరఫు న్యాయవాది చెప్పారని, పరువు నష్టం దావా కేసుకు ముగింపు పలకడానికి ఇది సరయినదని తాము భావిస్తున్నామని బెంచ్ పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు సూచనకు రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అంగీకరించలేదు సరికదా, విచారం వ్యక్తం చేయడం కన్నా కేసును వాదించడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అంతేకాదు ప్రతివాది ఫిర్యాదు దురుద్దేశపూరితమైనదని, అందువల్ల దాన్ని కొట్టివేయాలని ఆయన వాదించారు. కాగా, దీనిపై తన సమాధానాన్ని నాలుగు వారాల్లోగా దాఖలు చేయాలని బెంచ్ కుంటేను ఆదేశిస్తూ, అవసరమైతే ఆ తర్వాత నాలుగు వారాల్లో రాహుల్ గాంధీ దానికి తన ప్రతి సమాధానాన్ని దాఖలు చేయవచ్చని పేర్కొంది. పరువు నష్టం దావా కేసులకు సంబంధించిన చట్టాలు రాజ్యాంగపరంగా చెల్లుబాటును సవాలు చేస్తూ బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా 27 మంది దాఖలు చేసిన పిటిషన్లపై బెంచ్ ఇప్పటికే తన తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లను తాను అనుమతిస్తే అప్పుడు ఏ పరువు నష్టం దావా కేసు కూడా బతికి బట్టకట్టదని కూడా అప్పట్లో బెంచ్ వ్యాఖ్యానించింది కూడా.