జాతీయ వార్తలు

పేదలకు న్యాయం చేస్తాం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలుచేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు చివర రోజు కావటంతో ఈ పథకం తాము అధికారంలోకి వస్తే అమలుచేస్తామని వాగ్ధానం చేస్తూ ఈ పథకం వివరాలను మీడియాకు వివరించారు. ఈ పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. దీనిపై గణాంకాలు సేకరించామని, భారత్‌లో ఈ పథకం వల్ల 25 శాతం మంది ప్రయోజనం పొందవచ్చని అన్నారు. ఐదు కుటుంబాల్లోని 25 కోట్ల మంది ప్రజలు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. నెలకు ఒక్కొక్క కుటుంబం కనీసం నెలకు రూ.12వేలు పొందేలా ఈ పథకం రూపకల్పన చేశామని, వీరి బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి రూ.72,000లు జమ అవుతుందని అన్నారు.నీతి ఆయోగ్ ఈ పథకం అమలుచేయటం కష్టమని పేర్కొందని అడుగగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుచేయగా ఇది అమలుచేయలేమా అని అన్నారు.