జాతీయ వార్తలు

క్షమాపణ చెప్పకుంటే విచారణకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి సుప్రీం కోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరెస్సెస్‌కు క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటారా?- అని సుప్రీం కోర్టు కాంగ్రెస్ యువనేతను ప్రశ్నించింది. ఓ సంస్థపై అలాంటి నిందలు ఎలా వేస్తారని కోర్టు నిలదీసింది. ఈ విషయమై జూలై 27లోగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 2014 మార్చి 6న భివాండిలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌ను విమర్శిస్తూ మాట్లాడారు. ఒక సంస్థ మొత్తాన్ని ఎలా నిందిస్తారని కోర్టు ప్రశ్నించింది. సంజాయిషీ ఇచ్చేందుకు రెండు వారాల గడువు కావాలని రాహుల్ తరఫున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ నెల 27లోగా వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.