జాతీయ వార్తలు

కాంగ్రెస్ నేతల అరెస్టుపై రాహుల్ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయటం పట్ల కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మిర్, పార్టీ అధికార ప్రతినిధి రవీంద్రశర్మను పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని ఆయన ఖండించారు. ఇది అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని అన్నారు. ఇలాంటి అనాలోచిత చర్యల నుంచి ఎపుడు బయటకు వస్తారని ఆయన అన్నారు. ఇదిలావుండగా జమ్మూకశ్మీర్‌లో శనివారం నుంచి ఆంక్షలు తొలగించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.