జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థను ప్రధాని ధ్వంసం చేశారు: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను ప్రధాని ధ్వసం చేశారని, రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినప్పుడు నల్లధనం వెనక్కి తెస్తామన్నారని, అవినీతి నిర్మూలిస్తామని చెప్పారని, లక్షల కోట్లు అదానీ, అనిల్ అంబానీల జేబుల్లో వేశారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రామ్‌లీలా మైదానంలో శనివారంనాడు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన 'భారత్ బచావ్' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశానికి క్షమాపణ చెప్పాల్సింది తాను కాదనీ, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన ప్రధాని మోదీ, ఆయన సహచరుడు అమిత్‌షాలే దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటులో తనను క్షమాపణ చెప్పమని బీజేపీ అడిగినప్పుడు, నిజం మాట్లాడేవాళ్లు క్షమాపణలు చెప్పరని తాను తెగేసి చెప్పానన్నారు. తాను రాహుల్ సావర్కర్‌ను కాదని, రాహుల్ గాంధీనని ఆయన చురకలు వేశారు.భిన్న జాతులు, భిన్నమతాలు, భిన్న సంస్కృతీ సంప్రదాయలకు నిలయమైన భారతదేశంలో ఇప్పుడు ఏమి జరుగుతోందని యావత్ ప్రపంచం మనవైపు చూస్తోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈశాన్య ప్రాంతాల గోడు వినే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.