జాతీయ వార్తలు

ఆజాద్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీని నిలదీసిన రాహుల్

లక్నో, డిసెంబర్ 24: ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్‌ను ఎందుకు సస్పెండ్ చేసారో చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసారు. అంతేకాదు నేను అవినీతికి పాల్పడను, ఇంకొకరిని అవినీతికి పాల్పడనివ్వనన్న మోదీ ఎన్నికల నినాదాన్ని సైతం ఆయనకు గుర్తు చేసారు. ‘ఎన్నికల ప్రచార సమయంలో మోదీ కుంభకోణాల గురించి మాట్లాడుతూ, తాను అవినీతిని అనుమతించనని చెప్పారు. అయితే ఇప్పుడు కుంభకోణాలు వరసగా జరుగుతున్నాయి. క్రికెట్ కుంభకోణం తాజాది. అంతేకాదు, దాన్ని లేవనెత్తిన ఎంపీని బిజెపినుంచి సస్పెండ్ చేసారు’ అని అమేథీలో రెండు రోజుల పర్యటన తర్వాత గురువారం ఢిల్లీ తిరిగి వెళ్తూ లక్నోలో విలేఖరులతో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. అవినీతిని కూకటివేళ్లతో పెకలించి వేస్తానన్న మోదీ మాటలను రాహుల్ ఎద్దేవా చేస్తూ ‘న ఖావుంగా, న ఖానే దూంగా అని మోదీ ఎప్పుడూ అంటుంటారు. అయితే ఇప్పుడు ఆయన వౌనం వహిస్తున్నారు. ఆయన మాటలపై ప్రజలకు నమ్మకం సడలుతోంది’ అని అన్నారు. జైట్లీ 13 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండిన ఢిల్లీ క్రికెట్ సంఘం (డిడిసిఏ) వ్యవహారాలపై ప్రధాని దర్యాప్తు జరిపించాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కుమ్మక్కయి, పార్టీ అప్రతిష్ఠ పాలు చేస్తున్నారన్న ఆరోపణలపై బిజెపి బుధవారం కీర్తి ఆజాద్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేసిన తర్వాత రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన ఒక రోజు తర్వాత రాహుల్ ఎన్డీఏ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ధ్వజమెత్తుతూ కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్న ధరలపై ప్రధాని మోదీని దుయ్యబట్టడమే కాకుండా ప్రధాని జరుపుతున్న విదేశీ పర్యటనల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అమేథీలో ఉన్న సమయంలోను రాహుల్ బుధవారం పలు రోడ్‌పక్క సభల్లో మాట్లాడుతూ ధరల పెరుగుదలపై మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అంతేకాదు, అచ్ఛేదిన్ (మంచిరోజులు) ప్రధానమంత్రికి మాత్రమే వచ్చాయి తప్ప సామాన్యుడికి కాదని అన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ఓట్లకోసం హిందువులు, ముస్లింలను చీల్చిడానికి ప్రయత్నించారని కూడా ఆయన అన్నారు. అంతేకాదు తన నియోజకవర్గం అమేథీ పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమను చూపిస్తోందని రాహుల్ ఆరోపించారు. అమేథీలో ఫుడ్ పార్క్, పేపర్ మిల్లు ప్రాజెక్టులను రద్దు చేయడంపై గ్రామ ప్రధాన్‌లు తమ నిరసన తెలియజేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను గ్రామ ప్రధాన్‌ల ద్వారానే అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు.