జాతీయ వార్తలు

దేశంనుంచి మాల్యా ఎలా పారిపోయాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, మార్చి 10: బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి ఉన్న మద్యం వ్యాపారి విజ య్ మాల్యా దేశం వదిలిపెట్టి వెళ్లడానికి ఎలా అనుమతించారంటూ కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రసంగాల్లో ఈ ప్రశ్నకు సమాధానం చెప్ప లేకపోయారన్నారు. ఈ ప్రభుత్వం మాల్యాలాంటి వ్యక్తులకు ఎందుకు సాయం చేస్తోందని, నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చి, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మొత్తం దేశం ప్రశ్నిస్తోందని రాహుల్ అన్నారు. అంతేకాదు దొంగలు, బ్లాక్ మార్కెటీర్లు, డ్రగ్ మాఫియా తమ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవడానికి మాత్రమే తోడ్పడే ‘ఫెయిర్ అండ్ లలీ’లాంటి పన్ను ఊరట పథకాన్ని తీసుకు వచ్చిందంటూ ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఒక పేద వాడు దొంగతనం చేస్తే అతడ్ని చావగొట్టి జైల్లోకి తోస్తారు. ఎవరైనా తినడానికి తిండి లేక ఒక రొట్టె దొంగిలిస్తే అతడ్ని చావగొట్టి జైల్లో తోసే మీరు అదే ఒక బడా వ్యాపారి దేశాన్ని 9 వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకుంటే అతను ఫస్ట్‌క్లాస్‌లో దేశంనుంచి తప్పించుకోవడానికి అనుమతించారు. ఇదేమిటి?’ అని రాహుల్ ప్రశ్నించారు. ‘9 వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి దేశంనుంచి ఎలా పారిపోగలిగాడని మేము ప్రశ్నించాం. అతను తప్పించుకు పోవడానికి మీరు ఎలా అనుమతించారు? ఇది చాలా చిన్న ప్రశ్న. అయితే దీనికి మోదీజీనుంచి కానీ, జైట్లీజీనుంచి కానీ సమాధానం రాలేదు. అతను దేశంనుంచి తప్పించుకు పోవడానికి మీ ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? అనేది ప్రశ్న’ అని రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తానని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఉన్నట్లయితే అది మాల్యా విదేశాలకు పారిపోవడానికి అనుమతించి ఉండకూడదని, అతడ్ని ఆపి ఉండాల్సిందని ఆయన అన్నారు.
‘మాల్యా దేశంనుంచి ఎలా తప్పించుకున్నాడు, ఆయనపై చర్య తీసుకున్నారా, ఆయనపై లుకౌట్ నోటీసు ఉందా, అలా అయితే ఆయన రాజ్యసభలో ఏం చేస్తున్నారని మా పార్టీ జైట్లీని అడిగింది’ అని రాహుల్ చెప్పారు. (చిత్రం) మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ