రాష్ట్రీయం

తడిసి ముద్దయిన కోస్తాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీలోని కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓవైపు ఖరీఫ్ నారుమళ్లు ఆలస్యంకాగా మరోవైపు నారుమళ్లలోని నీరు బయటకు పోకపోవటంతో నారుమళ్లు కుళ్లిపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవళి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగానూ వర్షాలు కురిసాయి. రోడ్లపై నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. అర్థరాత్రి నుంచి వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.