జాతీయ వార్తలు

భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలడం తదితర కారణాల వల్ల దాదాపు 25మంది మృత్యువాత పడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల బీభత్సానికి జనం అల్లాడుతున్నారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎనిమిది మంది, జమ్మూకాశ్మీర్‌లో ఏడుగురు, పంజాబ్ ఆరుగురు, హరియాణాలో నలుగురు చనిపోయారు. మనాలీ ప్రాంతంలో ముగ్గురు గల్లంతయ్యారు. పలుచోట్ల విద్యాసంస్థలను మూసివేశారు. జలంధర్‌లో ఎనిమిది నెలల చిన్నారి వరదలో కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.