జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే ఇక్కడ మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జోథ్‌పూర్‌లో వరద నీటిలో చిక్కుకున్న బస్సులోని ప్రయాణీకులను అధికారులు రక్షించారు. జూన్ నెల ప్రవేశించినప్పటికీ విదర్భ, దక్షిణ తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఇంకా వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన వాయు తుఫాన్ వల్ల అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రుతుపవనాల ఆగమనానికి ఏర్పడ్డ అడ్డంకులు తొలగిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడుతున్నాయని ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు విస్తరించి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.