జాతీయ వార్తలు

తీర ప్రాంతం సురక్షితం:రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: నౌకాదళం నీడలో దేశ సముద్ర మార్గం అత్యంత సురక్షితంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ‘నావెల్ కమాండర్స్ కాన్ఫరెన్స్’లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముంబయి తరహా దాడులు జరగకుండా నేవీ పటిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు. భారత్ ఎన్నడూ పరాయి దేశంపై దాడి చేసి అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, అదే సందర్భంలో మన దేశం పట్ల చిన్నచూపుతో హానికర చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నేవీ నిఘా నీడలో మనదేశ సముద్ర మార్గం అత్యంత సురక్షితంగా ఉందని అన్నారు.