కరీంనగర్

రాజన్నకు భక్తజన నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ,జూన్ 5: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కిక్కిరిసింది.శుక్రవారం 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.స్వామివారి దర్శనానికి భక్తులకు రెండుగంటలకు పైగా సమయం పట్టింది. మొదట స్వామివారికి భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం స్వామివారి నిత్య కళ్యాణం,సత్యనారాయణ వత్రాలు, ఆకుల పూజ,అన్నపూజ,కుంకుమపూజ తదితర మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయం బయట స్వామివారి పేరిట తులాభారం (బెల్లం మొక్కు) మొక్కును చెల్లించుకొని కొంత పేద భక్తులకు పంపిణీ చేశారు. భక్తులను ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఇవో రాజేశ్వర్ పర్యవేక్షించారు.
హామీలు విస్మరించిన ప్రభుత్వం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
సుల్తానాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విస్మరిస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో పలు పార్టీలకు చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి విజయరమణారావు కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల శాఖ అధ్యక్షుడు పాల రామారావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి సాయిరి మహేందర్, వెగోళం అబ్బయ్య గౌడ్, అమిరిశెట్టి తిరుపతితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.