తెలంగాణ

జెఎన్‌యు సంఘటనల వెనుక హఫీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అఫ్జల్‌గురు అనుకూల చర్యలు, భారత వ్యతిరేక నినాదాలు చేసిన సంఘటనల వెనుక లష్కరేతోయిబా అధినేత హఫీజ్ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు దేశం అంతా ఒకే వాణి విన్పించాలని ఆయన సూచించారు. భారత పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు తరపున ఓ కార్యక్రమం నిర్వహించడం, ఆ సందర్భంగా దేశవ్యతిరేక నినాదాలు చేయడం, ఇందుకు కారకుడైన విద్యార్థిసంఘ నాయకుడిపై దేశద్రోహ కేసు నమోదుచేసి అరెస్టు చేయడంతో వివాదం రేగిన విషయం తెలిసింది. కాగా ఈ కేసు ప్రస్తుతం స్పెషల్‌బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కొన్ని పార్టీలు విద్యార్థులపై చర్యలను వ్యతిరేకిస్తుండగా జాతివ్యతిరేక చర్యలకు పాల్పడినవారిని వదిలేది లేదని కేంద్రం చెబుతోంది. కాగా విద్యార్థులు క్రమశిక్షణ తప్పారేగానీ దేశద్రోహానికి పాల్పడలేదని, జెఎన్‌యుపై దేశద్రోహ ముద్ర వేయవద్దని వర్శిటీ అధ్యాపక సిబ్బంది కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం వారు ప్రదర్శన నిర్వహించనున్నారు.