బిజినెస్

త్వరలోనే రెండంకెల వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం

న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత జిడిపి వృద్ధిరేటు త్వరలోనే రెండంకెల స్థాయికి చేరుకుంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత యుపిఎ ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను మందగమనంలోకి నెట్టాయన్న ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతోందన్నారు. శనివారం ఇక్కడ పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విదేశీ మదుపరులు పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్ వైపే చూస్తున్నారన్నారు. 1990లలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశ జిడిపి 8 శాతాన్ని తాకిందన్న ఆయన ప్రపంచ ఆర్థిక మాంద్యం కూడా భారత్‌పై ప్రభావం చూపలేకపోయిందన్నారు. అయితే ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ సర్కారుతో నానాటికీ దేశ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. 2004-14 మధ్య పదేళ్ళపాటు పరిపాలించిన యుపిఎ ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను అధోగతి పట్టించాయంటూ మండిపడ్డ రాజ్‌నాథ్.. గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన తమ ఎన్‌డిఎ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే జిడిపి వృద్ధిరేను పరుగులు పెట్టించిందన్నారు. ప్రస్తుతం 7.5-7.6 శాతం వద్ద ఉందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వ్యాపారానికి అనువైన నిర్ణయాలు తీసుకుంటుందని, మదుపరులకు స్నేహ హస్తం అందిస్తోందన్న ఆయన మరిన్ని విదేశీ పెట్టుబడులను దేశంలోకి తెప్పిస్తామన్న ధీమాను కనబరిచారు.