బిజినెస్

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్జీ-3 డివిజన్ జిఎం వెంకట రామయ్య

సెంటినరికాలనీ, నవంబర్ 30: ఆర్జీ-3, అడ్రియాల డివిజన్లలో ఉద్యోగులంతా కలిసి క్వాలిటీతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని ఆర్జీ-3 డివిజిన్ జిఎం డాక్టర్ ఎంఎస్ వెంకట రామయ్య కోరారు. సెంటినరికాలనీలోని జిఎం కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. నవంబర్‌లో అడ్రియాల గనిలో 75 వేల టన్నుల లక్ష్యానికి 1.50 లక్షల టన్నులు సాధించడంతోపాటు 2015-16వ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1 మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి సాధించిందన్నారు. ఓసిపి-2లోని విస్తరణ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల టన్నులు, ఓసిపి-1 ద్వారా 4.18 లక్షల టన్నుల బొగ్గు సాధించడంతో భారీగా బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయన్నారు. అయతే ఇందులో నాణ్యత కలిగిన బొగ్గును ఎన్‌టిపిసికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాణ్యత లేని మిగిలిన బొగ్గును రామకృష్ణాపూర్‌లో కోల్ వాషర్‌కు రవాణా చేస్తున్నామని చెప్పారు. 2లక్షల టన్నులు రవాణా చేయాల్సి ఉండగా, 32వేల టన్నులు పంపించామని తెలిపారు. ఏప్రిల్-నవంబర్ మధ్య ఆర్జీ-3 డివిజన్‌లో ఓసిపి-1, 2లలో 37.50 లక్షల టన్నులకు 39.48 లక్షల టన్నులు, అడ్రియాల డివిజన్‌లో జిడికె-10, 10ఎ, అడ్రియాల గని 25.52 లక్షల టన్నులకు 13.14 లక్షల టన్నుల బొగ్గు సాధించిందన్నారు. ఓవర్ బర్డెన్ 83 శాతం సాధించిందన్నారు. కాగా, అడ్రియాల డివిజన్‌లో అడ్రియాల గని నవంబర్ నెలలో అత్యధికంగా బొగ్గు సాధించి యాజమాన్యం ప్రోత్సహించిన ఇనె్సంటివ్‌కు అర్హత సాధించిందన్నారు. నవంబర్ నెలలో 75వేల టన్నులకు 1.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదవడంతో ప్రత్యేక ఇనె్సంటీవ్ స్కీమ్‌కు గని కార్మికులందరూ అర్హత సాధించారన్నారు. మరోవైపు సింగరేణి సంస్థలో మొట్టమొదటి సారిగా మ్యాచింగ్ గ్రాంట్ కార్మికులు, యాజమాన్యం జమ చేసిన డబ్బుల్లో నుంచి గని ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి 15లక్షల రూపాయల చొప్పున సంస్థ త్వరలో చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, మందమర్రి డివిజన్‌లో ఆర్‌కె-1 ఎ కార్మికుడు గోలి లక్ష్మయ్య నవంబర్ 2న ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కంపెనీలోని కార్మికులందరికి ఒక్కొక్కరికి 14రూపాయలు జీతంలో కోత విధించాలని సర్క్యులర్ జారీ అయిందని తెలిపారు. దీని ద్వారా 7.50 లక్షలు జమవుతాయని, యాజమాన్యం మరో 7.50 లక్షలను కలిపి మొత్తం 15 లక్షల రూపాయలు సదరు కార్మికుని భార్యకు అందజేస్తామని తెలిపారు. (చిత్రం) విలేఖరులతో మాట్లాడుతున్న వెంకట రామయ్య