రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..62 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాథుడు గల ఆ సీత అనాథలా నార చీర కట్టుకోవడం చూసి ప్రజలంతా గట్టిగా ఏడుస్తూ దశరథుణ్ని నిందించారు. వెంటనే దశరథుడు దుఃఖంతో తన జీవితాన్ని, ధర్మాన్ని, కీర్తిని కూడా పట్టించుకోకుండా, వేడిగా నిట్టూరుస్తూ కైకేయితో చెప్పాడు.
‘ఓ కైకేరుూ! సీత నార చీరని ధరించి అడవికి వెళ్లకూడదు. ఈమె చిన్నపిల్ల. సుకుమారి. సదా సుఖాలకే అలవాటు పడింది. అలాంటి సీత వనవాసానికి తగింది కాదు అని నా గురువు చెప్పిన మాట నిజమే. జనక మహారాజు కుతురైన సీత ఎవరికి, ఏం అపకారం చేసిందని సన్న్యాసినిలా నార చీర కట్టుకుని, దీనురాలై జనం మధ్యలో ఇలా నించుంటోంది? ఈ సీత నార చీరలు ధరించాల్సిన అవసరం లేదు. నేను నీకా వరం ఇవ్వలేదు. అందుచేత సీత సమస్తమైన రత్నాలని వెంట తీసుకుని అడవికి సుఖంగా వెళ్లాలి. జీవించడానికి అర్హత కూడా లేని నేను నీ బలవంతం వల్లే క్రూరమైన వరాలని ఇచ్చాను. మూర్ఖురాలై నువ్వు చేసే ఈ పని వెదురు కర్రకి పూసిన పువ్వే దాన్ని కాల్చేసినట్లు నన్ను దహిస్తోంది. ఓ పాపాత్మురాలా! నీచురాలా! రాముడు నీకేమైనా చెడు చేసాడేమో కాని సీత నీకేం అపకారం చేసింది? ఆడ లేడిలా విశాలమైన కళ్లు గల సీత మృదువైన స్వభావం గలది. ఆమె మీద జాలి చూపించాలి. పాపాత్మురాలా! నువ్వు రాముడ్ని అడవికి పంపించేస్తున్నావు. అది చాలక ఇంకా ఈ నీచమైన పాపాలని ఎందుకు చేస్తున్నావు? అభిషేక సందర్భంలో రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అతనితో ఏం చెప్పావో నేను ఆ మేరకే నీకు వరాలు ఇచ్చాను. దానికి మించి సీత నారచీర కట్టుకుంటూంటే చూడాలని కోరుకునే నువ్వు నరకానికి పోతావు’
ఇలా ఏడ్చే దశరథుడి విచారానికి అంతం కనపడలేదు. ఆయన కొడుకు మీది ప్రేమతో, మనోవేదనతో నేల మీద పడిపోయాడు.
అడవికి ప్రయాణమైన రాముడు తల వంచి కూర్చున్న తండ్రితో ఇలా చెప్పాడు.
ధర్మాత్ముడివైన ఓ మహారాజా! కీర్తి గల నా తల్లి కౌసల్య వృద్ధురాలు. ఆమెది నీచ స్వభావం కాదు. ఎన్నడూ నిన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. వరాలిచ్చే ఓ మహారాజా! గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టాలు తెలీని ఆవిడ నేను దూరంగా వెళ్తూండటంతో శోక సముద్రంలో మునిగిపోయింది. అలాంటి ఆవిడ ఆదరంగా చూడు. పూజ్యుడైన నువ్వు ఆవిడని ఆదరిస్తే, నన్ను గురించి ఆలోచిస్తూ ఆమె పుత్రశోకం పొందకుండా నీ మీద ఆధారపడి జీవిస్తుంది. ఇంద్రుడితో సమానమైన రాజా! నా మీద అధిక ప్రేమ గల నా తల్లి నేను అడవికి వెళ్లిన తర్వాత దుఃఖంతో కృశించి ప్రాణాలు విడిచి యమ లోకానికి వెళ్లకుండా చూసుకో’ (అయోధ్య కాండ సర్గ -38)
రాముడి మాటలు విని, అతన్ని ముని వేషంలో చూసిన దశరథుడికి, ఆయన భార్యలకి మూర్ఛ వచ్చింది. విచారంలో మునిగిన దశరథుడు రాముడి వైపు చూడలేక పోయాడు. బాధపడే మనస్సు వల్ల రాముడి మొహంలోకి చూసి జవాబు చెప్పలేక పోయాడు. కొద్దిసేపు స్పృహ లేకుండా పడి ఉండి రాముడి గురించే ఆలోచిస్తూ ఏడ్చాడు.
‘కాలం రాకుండా ప్రాణాలు దేహాన్ని విడిచి వెళ్లవు. అందువల్లే కైకేయితో ఈ విధంగా బాధించబడే నేను, అగ్నితో సమానుడైన కొడుకు సన్నటి బట్టలు విడిచి మునులు ధరించే నార చీరలని ధరించి ఎదుట నిలబడటం చూసి కూడా నాకు చావు రాలేదు. ఇలా కుట్ర పన్ని స్వలాభం కోసం ప్రయత్నించే ఒక్క కైకేయి మూలంగా జనమంతా బాధ పడుతున్నారు.’
ఆయన కన్నీళ్లతో ఒళ్లంతా తడిసిపోయింది. ‘రామా!’ అని గట్టిగా అరిచి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అది చూసి లక్ష్మణుడు కూడా చాలా బాధపడ్డాడు. కొద్దిసేపటికి స్పృహ వచ్చిన దశరథుడు కన్నీళ్లు కారుస్తూ సుమంత్రుడితో ఇలా చెప్పాడు.
‘నువ్వు ప్రయాణానికి అనుకూలమైన రథానికి మంచి గుర్రాలని కట్టి, తీసుకు వచ్చి మహా భాగ్యశాలి ఐన ఈ రాముడ్ని ఈ దేశానికి అవతల ఉన్న అడవిలో చేర్చు. సత్పురుషుడు, వీరుడు ఐన కొడుకుని తల్లిదండ్రులు ఈనాడు అడవికి పంపుతున్నారు. గుణవంతుడికి మంచి గుణాలు ఉన్నందుకు కలిగే ఫలితం ఇదే అనుకుంటున్నాను.’
సుమంత్రుడు వేగంగా వెళ్లి అలంకరించిన రథాలకి గుర్రాలని కట్టి తీసుకుని వచ్చాడు. సుమంత్రుడు రాముడికి నమస్కరించి చెప్పాడు.
‘ఉత్తమమైన గుర్రాలు కట్టి బంగారంతో అలంకరించబడ్డ రథం సిద్ధంగా ఉంది’
దేశ కాలాలు తెలిసినవాడు, నిశ్చితమైన బుద్ధి కలవాడు, నిజాయితీపరుడు ఐన కోశాధికారిని రాజు వెంటనే పిలిపించి చెప్పాడు.
‘సీతకి కావాల్సిన అమూల్యమైన బట్టలు, శ్రేష్టమైన అలంకారాలు వెంటనే తీసుకురా’
అతను రాజాజ్ఞ ప్రకారం కోశాగారం నించి వాటిని తెచ్చి సీతకి ఇచ్చాడు. అడవకి ప్రయాణమైన అందమైన సీత, ఉదయించే సూర్యకాంతి ఆకాశాన్ని ప్రకాశింపజేసినట్లుగా అందమైన తన అవయవాలని చక్కగా అలంకరించుకుని, విచిత్రాలైన ఆ అలంకారాలతో ఆ ఇంటిని ప్రకాశింప జేసింది. అలాంటి సమయంలో కూడా దీనంగా ప్రవర్తించక ఉత్సాహంగా ఉన్న సీతని కౌసల్య కౌగిలించుకుని తలపై వాసన చూసి చెప్పింది.
‘ఈ లోకంలో పతివ్రతలు కాని స్ర్తిలు తమని భర్తలు ఎంత గౌరవిస్తున్నా, ఆ భర్తలు చెడ్డ దశలో ఉన్నప్పుడు వారిని అవమానిస్తారు. ఆడవాళ్లు మునుపు ఎంత సుఖాలని అనుభవించినా, ఏ చిన్న ఆపద వచ్చినా కూడా చెడిపోయి, భర్తని కూడా వదిలేస్తారు. ఇది స్ర్తిల స్వభావం. చెడ్డ ఆలోచనలు గల యువతులకి శీలం ఉండదు. వికృతంగా ప్రవర్తిస్తారు. వారి హృదయాలని అర్థం చేసుకోవడం కష్టం. ఒక్క క్షణంలో భర్తని కోల్పోతారు. కులం కాని, ఉపకారం కాని, విద్య కాని, దానం కాని, ఆదరం కాని స్ర్తిల హృదయాలని ఆకర్షించవు. వారి హృదయాలు స్థిరమైనవి కావు. కాని శీలం, సత్యం, శాస్త్రం, శాంతి మొదలైన వాటిలో స్థిరమైన మనసు గల పతివ్రతలైన స్ర్తిలకి మాత్రం ఒక్క భర్తే పవిత్రుడిగా గొప్ప స్థానాన్ని పొందుతాడు. అడవికి పంపబడే నా కొడుకుని నువ్వు అవమానించక, డబ్బున్న వాడైనా, లేనివాడైనా ఇతన్ని నువ్వు దేవుడిలా చూసుకో’
సీత ధర్మార్థాలు రెంటికి అనుగుణంగా ఉన్న కౌసల్య మాటలని బాగా అర్థం చేసుకుని, అత్తగారికి నమస్కరించి చెప్పింది.
‘పూజ్యురాలైన నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. నేను అది గతంలో కూడా విని ఉన్నాను. నేను చెడ్డదానిని అని పూజ్యురాలివైన నువ్వు భావించద్దు. కాంతి చంద్రుడ్ని విడవనట్లు నేను ధర్మాన్ని విడువను. తీగలు లేని వీణ మోగదు. చక్రంలేని రథం నడవదు. తండ్రి కాని, తల్లి కాని, కొడుకు కాని స్ర్తికి ఇచ్చేది పరిమితమే. అపరిమితంగా ఇవ్వగలిగేది భర్త ఒక్కడే. అలాంటి భర్తని ఏ స్ర్తి ఐనా పూజించకుండా ఉంటుందా? ఇలాంటి ఆలోచనలు కలిగి, ధర్మానికి సంబంధించిన సామాన్య విషయాలని, గొప్ప విషయాలని విన్న నేను భర్తని ఎలా అవమానిస్తాను? స్ర్తిలకి భర్తే దేవుడు కదా?’
కౌసల్య సీత మనోహరమైన మాటలు విని సంతోషించింది. వెంటనే విచారంతో, ఆనందంతో కన్నీరు కార్చింది. పరమ ధర్మాత్ముడైన రాముడు తల్లులు అందరిలో ఎక్కువగా పూజింపబడే తన తల్లికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి చెప్పాడు.
‘అమ్మా! విచారించకు. నాన్నని చూసుకో. వనవాసం తొందరగానే ముగుస్తుంది. పధ్నాలుగు సంవత్సరాలు నీకు నిద్రలో గడిచినట్లుగా గడిచిపోతాయి. నేను మిత్రులతో కలిసి, ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని రావడం నువ్వు చూస్తావు’
మళ్లీ ఆలోచించి మూడు వందల మంది తల్లుల వంక చూశాడు. కౌసల్య లాగానే విచారించే ఆ తల్లులు అందరికీ నమస్కరించి ధర్మమైన మాటలని చెప్పాడు.
‘కలిసి నివసించడం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించండి. మీ అందరి దగ్గరా సెలవు తీసుకుంటున్నాను.’
ఆ ధర్మమైన మాటలని వినగానే, విచారమైన మనసులు గల వారంతా క్రౌంచ పక్షులు అరిచినట్లుగా ఏడ్చారు. గతంలో మేఘ ధ్వని లాంటి ధ్వనులతో మంగళ వాయిద్యాలు మారుమోగిన దశరథుడి ఇల్లు ఏడుపు, పెడబొబ్బలతో నిండి దుఃఖానికి నిలయమైంది.
‘ఇవాళ ముప్పై తొమ్మిదో సర్గ చెప్పాను. రేపు నలభయ్యవ సర్గ చెప్తాను. శుభమస్తు’ హరిదాసు ఆ రోజు కథని పూర్తి చేస్తూ చెప్పాడు. (అయోధ్యకాండ సర్గ -39)
ఆశే్లష వెంట ఆ రోజు వచ్చి ఆ హరికథని విన్న వాడి తల్లి శారదాంబ ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో చెప్పింది.
‘ఇవాళ హరిదాసు ఆరు తప్పులు చెప్పాడ్రా. ఇంటికెళ్లాక అయోధ్యకాండలోని 38,39 సర్గలు తీసి చూడు. అందులో ఇవి లేవు’ అని ఆవిడ ఆ తప్పుల్ని దారిలో చెప్పింది. ఆ తప్పులని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
చక్రవర్తి రజగోపాలాచారి రాసిన
రామాయణం పేరు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
వాల్మీకి జన్మదినం ఎప్పుడు?
ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.సైన్యంతో ప్రయోజనం లేదంటూ, ‘అడవికి నాకు కావాల్సినవి గునపం, గంప అనే రెండు మాత్రమే’ అని రాముడు చెప్పాడు. హరిదాసు దీన్ని చెప్పలేదు.
2.నార చీరలని రాముడికి ఎవరో ఇవ్వలేదు. ‘సిగ్గులేని కైకేయి ఆ జన సమూహంలో తానే స్వయంగా నార చీరలు తీసుకువచ్చి ‘ఇదిగో, కట్టుకో’ అని రాముడికి ఇచ్చింది. పురుష శ్రేష్ఠుడైన రాముడు కైకేయి చేతిలోంచి వాటిని తీసుకున్నాడని’ చెప్పడం హరిదాసు విస్మరించాడు.
3.గురువు వశిష్ఠుడు కైకేయిని మందలించాడు. కాని హరిదాసు మంత్రి సుమంత్రుడు చెప్పినట్లుగా తప్పు చెప్పాడు.
4.‘్భరతుడు దశరథుడికి పుట్టినవాడే ఐతే’ తండ్రి మనస్ఫూర్తిగా ఇవ్వని ఈ రాజ్యాన్ని పరిపాలించడు అని వశిష్ఠుడు చెప్పాడు. దీన్ని చెప్పడం హరిదాసు విస్మరించాడు.
5.‘తనకి అతి ప్రియమైన భర్తకి తగిన సేవలు చేయదలిచిన సీత తన అభిప్రాయాన్ని మార్చుకోక, అడవికి వెళ్లడానికే సిద్ధమైంది’ అన్న వాక్యంతో 37వ సర్గ ముగుస్తుంది. హరిదాసు దీన్ని చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి