రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 114 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునులంతా వెళ్లిపోయాక రాముడు బాగా ఆలోచించి అనేక కారణాల చేత అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
‘భరతుడు, తల్లులు, పౌరులు వచ్చి నన్ను ఇక్కడే కలిశారు. ఎప్పుడూ వాళ్ల గురించే విచారించే నన్ను వారి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఇక్కడికి దగ్గరలోనే సేన బస చేసింది కాబట్టి గుర్రాలు, ఏనుగుల పేడలతో ఆ ప్రదేశమంతా చెడిపోయింది. అందువల్ల ఇంకో చోటికి వెళ్లాలి’ అని ఆలోచించి రాముడు సీతాలక్ష్మణులతో కలిసి ప్రయాణమయ్యాడు.
గొప్ప కీర్తిగల రాముడు అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్లి ఆయనకి నమస్కరించాడు. ఆ మహాముని కూడా రాముడ్ని కొడుకులా ఆదరించాడు. అత్రి మహాముని రాముడికి స్వయంగా ఆతిథ్యం ఇచ్చి మంచి మాటలతో లక్ష్మణుడ్ని, మహా భాగ్యవంతురాలైన సీతని సంతోషపెట్టాడు. ధర్మాలు తెలిసిన, సమస్త ప్రాణుల హితం కోరే ఆ మహాముని అటు వైపు వచ్చిన వృద్ధురాలైన తన భార్యని పిలిచి ఆమె ఎదుట వారి గురించి మంచి మాటలు చెప్పి సంతోషపెట్టాడు. ఋషి శ్రేష్ఠుడైన ఆ అత్రి మహాముని, మహా భాగ్యవంతురాలు, తపస్వి, ధర్మాన్ని ఆచరించే అనసూయతో ‘సీతని గౌరవించు’ అని చెప్పాడు. వారికి తన భార్యైన అనసూయ గురించి ఇలా చెప్పాడు.
‘ఓ రామా! ఈ అనసూయ పాతిక సంవత్సరాల పాటు అనావృష్టి వచ్చి లోకమంతా కాలిపోయేప్పుడు దుంపలు, ఫలాలు సృష్టించి గంగానదిని ప్రవహింప జేసింది. ఉగ్రమైన తపస్సు చేసిన ఈమె అనేక నియమాలని పాటించింది. పది వేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేసింది. ఎన్నో వ్రతాలని కూడా చేసింది. దేవతలకి సహాయం చేయడం కోసం అనేక విఘ్నాలని తొలగించి పది రాత్రులని ఒకే రాత్రి చేసింది. ఈమె నీకు తల్లి లాంటిది. తన పనుల చేత అనసూయ (కోపం లేనిది) అని లోకంలో ప్రసిద్ధి చెందిన ఈమె సర్వ ప్రాణులూ నమస్కరించదగినది. కీర్తివంతురాలు, వృద్ధురాలు. ఎన్నడూ కోపం తెలీదు. అలాంటి ఈమెని సీత కలవాలి.’
రాముడు ఆ మహాముని చెప్పిన మాటలు విని ధర్మం తెలిసిన సీతతో చెప్పాడు.
‘సీతా! ఈ మహాముని మాట విన్నావు కదా? వెంటనే తపోధనురాలైన అనసూయ దగ్గరికి వెళ్లు. నీకు మంచి జరుగుతుంది’
సీత తన మంచి కోరి రాముడు చెప్పిన మాట విని ధర్మం తెలిసిన అనసూయని ప్రదక్షిణ పూర్వకంగా సమీపించింది. మహా పతివ్రత, మహా భాగ్యశాలైన ఆ అనసూయ శరీరం వృద్ధాప్యంతో ముడతలు పడి బలహీనపడింది. జుట్టు తెల్లబడింది. ఆవిడ గాలిలో అరటిచెట్టులా వణుకుతోంది. ఎలాంటి దోషాలు లేని అనసూయకి సీత తన పేరు చెప్తూ నమస్కరించి, దోసిలి కట్టుకుని నిలబడి ‘ఆరోగ్యంగా ఉన్నారా?’ అని ప్రశ్నించింది.
అనసూయ బాగా సంతోషించి, మహా భాగ్యవంతురాలు, ధర్మాలు ఆచరించే సీతని ఓదారుస్తూ చెప్పింది.
‘్భగ్యవశం చేత నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు. బంధువులని, అహంకారాన్ని, ఐశ్వర్యాన్ని వదిలి నువ్వు అడవికి వెళ్లే రాముడి వెంట వచ్చావు. తమ భర్త అడవిలో వున్నా, నగరంలో ఉన్నా, పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, ఏ స్ర్తిలు అతన్ని అనుసరించి ఉంటారో వారికి ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఉత్తమ స్వభావం గల స్ర్తిలకి భర్త శీలం లేని వాడైనా, స్వేచ్ఛగా తిరిగే వాడైనా, దరిద్రుడైనా అతనే ఆప్తుడు. ఓ సీతా! నేను ఎంత ఆలోచించినా భర్తని మించిన బంధువు నాకు కనపడటం లేదు. అతను అనంతమైన తపస్సు వంటి వాడు. కామానికి వశమైన మనస్సుతో భర్త మీద అధికారం వహించే చెడ్డ స్ర్తిలు మంచి చెడ్డలని తెలుసుకోవడం లేదు. అకార్యాలు చేసే స్ర్తిలు ధర్మం నించి జారిపోయి అపకీర్తిని పొందుతున్నారు. ఉత్తమ గుణవంతులై లోకంలోనే మంచి చెడులని చూడగలిగే నీవంటి స్ర్తిలు మాత్రం అనేక ధర్మకార్యాలు చేసిన వారిలా స్వర్గంలో విహరిస్తారు. అందువల్ల నువ్వు భర్త వెంటే ఉండి, పతివ్రతల ఆచారాలని పాటిస్తూ, నీ భర్తకి సహధర్మచారిణిగా ఉండు. అందువల్ల నీకు ధర్మం, కీర్తి లభిస్తాయి.’ (అయోధ్యకాండ 117వ సర్గ)
అసూయ లేని సీత అనసూయ చెప్పిన మాటలు విని, వాటిని మెచ్చుకుంటూ మెల్లిగా చెప్పింది.
‘పూజ్యురాలైన నువ్వు నాతో ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కాదు. స్ర్తికి భర్త పూజ్యుడు అన్నది నాకూ తెలుసు. ఓ పూజ్యురాలా! నా భర్త చరిత్రహీనుడైనా నేను అతన్ని తప్పకుండా పూజించాల్సిందే. గుణాల చేత పొగడదగ్గవాడు, దయ గలవాడు, జితేంద్రియుడు, స్థిరమైన ప్రేమ గలవాడు, ధర్మాత్ముడు, తల్లిదండ్రుల్లా చాలా ఇష్టుడైన భర్త విషయంలో వేరే చెప్పాలా? మహా బలశాలైన రాముడు కౌసల్య విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో ఇతర రాజభార్యల విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. దశరథుడి మీద ప్రేమ గల, ధర్మవేత్త, పరాక్రమవంతుడైన రాముడు అహంకారం లేకుండా తండ్రి ఒక్కసారి చూసిన స్ర్తిలని కూడా తల్లుల్లా గౌరవిస్తాడు. భయంకరమైన ఈ నిర్జన అడవిలోకి వచ్చే సమయంలో అత్తగారు నాకు చేసిన ఉత్తమమైన ఉపదేశాన్ని మనసులో ఉంచుకున్నాను. పూర్వం పెళ్లి సందర్భంలో, అగ్ని సమక్షంలో నా తల్లి ఉపదేశించిన మాటలు కూడా మనసులో ఉంచుకున్నాను. ఓ ధర్మార్తురాలా! నీ మాటలు వినగానే వాళ్లు చేసిన ఉపదేశాలు మళ్లీ నాకు గుర్తుకు వస్తున్నాయి. స్ర్తికి పతిసేవ తప్ప మరో తపస్సు విధించబడలేదు. అలాగే ప్రవర్తించే నువ్వు కూడా పతి సేవతో స్వర్గానికి వెళ్తావు. అలాంటి ఎందరో ఉత్తమ స్ర్తిలు భర్తల విషయంలో దృఢమైన నియమాలని పాటిస్తూ తాము చేసిన పుణ్యకర్మలకి ఫలితంగా దేవలోకంలో పూజింపబడుతున్నారు.’
ఆ మాటలకి చాలా సంతోషించి, ఆమె శిరస్సు మీద వాసన చూసి ఆమెకి సంతోషం కలిగిస్తూ అనసూయ చెప్పింది.
‘అందమైన చిరునవ్వు గల ఓ సీతా! నేను అనేక విధాలైన నియమాలని పాటించి సంపాదించిన గొప్ప తపస్సు ఉంది. దాని బలం చేత నీకు ఇష్టమైంది కోరుకో. ఇస్తాను. నీ మాటలు యుక్తంగాను, మనోహరంగాను ఉన్నాయి. చాలా సంతోషిస్తున్నాను. ఏం కావాలో కోరుకో. ఇస్తాను.’
ఆ మాటలకి ఆశ్చర్యపడ్డ సీత చిరునవ్వుతో ‘ఇది చాలు. నువ్వు వరాలు ఇచ్చినట్లే’ అని తపోబలం గల అనసూయతో చెప్పింది. ధర్మాత్మురాలైన అనసూయ సీత మాటలు విని ఇంకా సంతోషించి చెప్పింది.
‘ఓ సీతా! నాకు నీ విషయంలో కలిగిన అధిక సంతోషాన్ని సఫలం చేస్తాను. విదేహ రాజపుత్రికవైన నీకు దివ్యమైనవి, శ్రేష్టమైనవైన ఈ పూల మాలలని, వస్త్రాన్ని, అలంకారాలని, అంగరాగాన్ని, శ్రేష్టమైన లేపనాన్ని ఇస్తున్నాను. ఇది ఎప్పుడూ అనుకూలంగా ఉండి, దేహం నలగకుండా చేసి అందాన్నిస్తాయి. దివ్యమైన ఈ అంగరాగాన్ని శరీరానికి పూసుకుని నువ్వు నాశనం లేని విష్ణువుని లక్ష్మి శోభింపచేసినట్లు నీ భర్తని శోభింపచేయగలవు.’
అనసూయ దానంగా ప్రేమగా ఇచ్చిన వస్త్రం, అంగరాగం, ఆభరణాలు, మాలికలని ఇష్టంగా స్వీకరించి, కీర్తిగల సీత చేతులు జోడించి నమస్కరించి అనసూయని సేవించింది. స్థిరమైన నియమాలు గల అనసూయ తన పక్కన కూర్చున్న సీతని ప్రియమైన విషయాలని అడిగింది.
‘సీతా! కీర్తివంతుడైన రాముడు నిన్ను స్వయంవరంలో పొందాడని నేను విన్నాను. ఆ విషయాలన్నీ నేను వివరంగా వినాలని అనుకుంటున్నాను. కాబట్టి జరిగింది జరిగినట్లు పూర్తిగా చెప్పు.’
ధర్మాత్మురాలైన అనసూయకి సీత ఆ కథంతా చెప్పింది.
‘మిథిలకి ప్రభువు, వీరుడు, ధర్మవేతె్తైన జనకుడు క్షత్రియధర్మంతో న్యాయానుసారంగా భూమిని పాలిస్తున్నాడు. ఆ రాజు నాగలి పట్టి మండలాకారంలో ఉన్న భూమిని తవ్వుతూంటే నేను ఆ నేలని బద్దలు కొట్టుకుని పైకి వచ్చి ఆ రాజుకి కూతుర్ని అయ్యాను. ఆ క్షేత్రంలో ఔషధ బీజాలని పిడికిళ్లతో చల్లే పనిలో నిమగ్నుడైన రాజు శరీరమంతా పుప్పొడి కప్పి ఉన్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. సంతానం లేని ఆ జనకుడు నన్ను స్వయంగా లేవనెత్తి, ఒళ్లు పడుకోబెట్టుకుని ‘ఈమె నా కూతురు’ అని చెప్తూ నాపై ప్రేమని చూపించాడు. ‘ఓ రాజా! ఈమె మనుష్య జాతికి చెందింది కాదు. సాటిలేని దేవతా స్ర్తి. ధర్మం చేత ఈమె నీకు కూతురే’ అని మంత్రులు చెప్పారు. అది విని ధర్మాత్ముడైన నా తండ్రి నన్ను పుత్రికలా సంతోషంతో చేరదీశాడు. ఆనాటి నించి అధికైశ్వర్యాన్ని పొందాడు.’

(అయోధ్యకాండ 118వ సర్గ - 32వ శ్లోకం దాకా)

ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓసారి రామాయణంలోని తను చెప్పిన కాండలని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో ఆరు తప్పులు చెప్పాను. క్షంతవ్యుణిణ. అవి చెప్తాను. వినండి.’

మీరా తప్పులని కనుక్కోగలరా?
*
1.రావణసురుడి తమ్ముడైన ఖరుడు అని వాల్మీకి ఆ పేరు కూడా రాశాడు. హరిదాసు ఆ పేరుని చెప్పలేదు.
2.రాక్షసులు మునులని బాధించే భాగంగా ‘అగ్నిగుండంలో నీళ్లు పోస్తున్నారు’ అని ముని చెప్పాడు. దీన్ని హరిదాసు చెప్పలేదు.
3.నువ్వు ఆ రాక్షసుడ్ని చంపి మాకు రక్షణ కలిగించు - అని మునులు రాముడ్ని వేడుకోలేదు. అది హరిదాసు కల్పనే.
4.‘ఇంక రెండు సర్గలతో ఈ కాండ పూర్తవుతుంది’ అని హరిదాసు తప్పుగా చెప్పాడు. ఇంకా మూడు కాండలు ఉన్నాయి.
*
మీకో ప్రశ్న
*
అత్రి మహాముని తండ్రి ఎవరు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

ఖరుడు ఎవరి కొడుకు?
*
కైకసి చెల్లెలు రాక కొడుకు

-మల్లాది వెంకట కృష్ణమూర్తి