రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 115 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యాత్ముడైన ఆ జనక మహారాజు నన్ను తన పట్టపు రాణికి చాలా ఇష్టమైన వస్తువుని ఇచ్చినట్లుగా ఇచ్చాడు. స్నేహశీలైన ఆమె నన్ను మాతృ ప్రేమతో ఆదరించింది. నాకు పెళ్లి వయసు రాగానే నా తండ్రి దీనుడై, ధనం పోయిన దరిద్రుడు ఎలా బాధ పడతాడో అలా బాధపడ్డాడు. భూలోకంలో దేవేంద్రుడి వంటి వాడైనా, ఆడపిల్ల తండ్రి తనతో సమానులైన వారి నించి, తన కంటే తక్కువ వారి నించి ఆడపిల్ల పెళ్లి విషయంలో లోకంలో తిరస్కారం పొందాల్సి వస్తుంది. అలాంటి తిరస్కారం తనకి చాలా దగ్గరలో ఉందని గ్రహించిన జనకుడు చింతా సముద్రంలో పడి, తెప్పలేని వాడిలా తీరాన్ని చేరలేక పోయాడు. నా తండ్రి ఎంత ఆలోచించినా, నాతో సమానుడు, నాకు తగిన భర్త ఆయనకి స్ఫురించలేదు. నిరంతరం ఆలోచన చేయగా, చేయగా నాకు స్వయంవరం చేయాలనే ఆలోచన నా తండ్రికి కలిగింది.
‘మహాత్ముడైన అగ్నిదేవుడు మనుషులు ఎవరూ ఎంత ప్రయత్నించినా కదపలేని శ్రేష్ఠమైన, బరువైన తన ధనస్సుని, తరగని బాణాలు గల రెండు అంబుల పొదులని పూర్వం ఓ మహా యజ్ఞంలో నా తండ్రికి ప్రేమగా ఇచ్చాడు. రాజులు కల్లో కూడా ఆ ధనస్సుని వంచడానికి సమర్థులు కారు. సత్యవాదైన నా తండ్రి ముందుగా రాజులందర్నీ పిలిచి ‘ఎవరు ఈ ధనస్సుని ఎత్తి దీనికి నారి కడతాడో అతనికి నా కూతుర్ని ఇచ్చి నిస్సందేహంగా పెళ్లి చేస్తాను’ అని చెప్పాడు. ఆ రాజులు కొండంత బరువుగల ఆ శ్రేష్ఠమైన ధనస్సుని కదల్చలేక దానికి నమస్కరించి వెళ్లిపోయారు.
‘చాలాకాలం గడిచాక గొప్ప కాంతి, సత్యమైన పరాక్రమం గల, రఘువంశంలో పుట్టిన ఈ రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి వెంట యజ్ఞం చూడటానికి వచ్చాడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు నా తండ్రి చేసిన పూజలని అందుకుని సోదరులైన రామలక్ష్మణుల గురించి ఆయనకి చెప్పాడు. ‘దశరథుడి కొడుకులైన ఈ రామలక్ష్మణులు ధనస్సుని చూడాలని అనుకుంటున్నారు. దేవతల ద్వారా లభించిన ఆ ధనస్సుని రాజపుత్రుడైన రాముడికి చూపించు’ అన్న విశ్వామిత్రుడి మాటలు విని నా తండ్రి దాన్ని తెప్పించాడు. మహాబలశాలి, పరాక్రమవంతుడైన రాముడు కొద్దిగా కష్టపడి దాన్ని వంచి, నారి ఎక్కించి లాగాడు. రాముడు లాగుతూండగా అది మధ్యకి విరిగి రెండు ముక్కలైంది. అప్పుడు పిడుగు పడ్డట్లుగా భయంకర శబ్దం వినిపించింది.
‘సత్య ప్రతిజ్ఞ గల నా తండ్రి నన్ను రాముడికి ఇవ్వడానికి జలపాత్రని పట్టుకున్నాడు. రాముడు తన తండ్రి, ప్రభువైన దశరథ మహారాజు అభిప్రాయం తెలుసుకోకుండా నా తండ్రి తనకి ఇచ్చే నన్ను స్వీకరించలేదు. నా తండ్రి వృద్ధుడైన, నా మామగారైన దశరథ మహారాజుని పిలిపించి, బుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడైన రాముడికి నన్ను ఇచ్చాడు. సాధు స్వభావం గల, చూడటానికి అందంగా ఉన్న నా చెల్లెలిని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. నా తండ్రి ఆ స్వయంవరంలో నన్ను ఆ విధంగా రాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పరాక్రమ వంతుల్లో గొప్పవాడైన భర్త మీద ధర్మానుసారంగా అనురాగం కలిగి ఉన్నాను.’ (అయోధ్యకాండ 118)
ధర్మాలు తెలిసిన అనసూయ ఆ గొప్ప కథని విని, సీత తలని వాసన చూసి చేతులతో కౌగిలించుకుంది.
‘నువ్వు అక్షరాలు, పదాలు స్పష్టంగా ఉండేట్లుగా మధురంగా, ఆశ్చర్యకరమైన రీతిలో మాట్లాడావు. నీ స్వయంవరం ఎలా జరిగిందో విన్నాను. మధురంగా మాట్లాడే ఓ సీతా! నీ కథ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాత్రి దగ్గర పడేట్లుగా చేసి సూర్యుడు అస్తమించాడు. ఆహారం కోసం పగలు సుదూర ప్రదేశాలకి వెళ్లి, సాయంత్రానికి తమ గూళ్లల్లో నిద్ర కోసమై అణగి ఉన్న పక్షుల ధ్వని వినిపిస్తోంది. మునులు కూడా స్నానం చేసి నీళ్లు నిండిన కలశాలతో, నీటిలో తడిసిన నార చీరలతో గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఋషులు సాయంకాలం చేయాల్సిన అగ్నిహోత్ర హోమాన్ని యథావిధిగా చేస్తూండగా పొగ గాలికి ఎగురుతూ కనపడుతోంది. చుట్టుపక్కల ఉన్న చిన్న ఆకులు గల చెట్లు కూడా దట్టంగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఆ ప్రదేశం కళ్లని దుర్భరం చేయడం వల్ల దిక్కులు ప్రకాశించడం లేదు. రాత్రి సంచరించే జంతువులు నాలుగు వైపులా తిరుగుతున్నాయి. ఈ తపోవనంలోని మృగాలు వేదికల మీద, రేవుల్లో పడుకుంటున్నాయి. ఓ సీతా! నక్షత్రాల చేత అలంకృతమైన రాత్రి ప్రారంభమైంది. చంద్రుడు వెనె్నలని కప్పుకుని ఆకాశంలో ఉదయించాడు. నీకు అనుమతిస్తున్నాను. ఇక నువ్వు రాముడి దగ్గరకి వెళ్లు. నీ మధురమైన మాటలకి చాలా సంతోషించాను. సీతా! నువ్వు నా ఎదురుగానే అలంకరించుకో. ఈ దివ్యాభరణాలతో శోభితురాలైన నాకు ఆనందాన్ని కలిగించు.’
దేవకన్యతో సమానురాలైన సీత అనసూయ కోరిక మేరకి అలంకరించుకుని ఆమెకి తల వంచి నమస్కరించి రాముడి దగ్గరికి వెళ్లింది. మాట్లాడే వాళ్లల్లో శ్రేష్ఠుడైన రాముడు ఇలా అలంకరించుకుని వచ్చిన సీతని, అనసూయ ప్రేమగా ఇచ్చిన వస్త్రాలు, అలంకారాలు, పూలమాలలని చూసి సంతోషించాడు. మనుషుల్లో ఎవరికీ లభించని, సీతకి జరిగిన ఆ సత్కారానికి రామలక్ష్మణులు సంతోషించారు. చంద్రుడి వంటి ముఖం గల ఆ రాముడు తపస్సిద్ధులైన మునుల ఆతిథ్యాన్ని స్వీకరించి పవిత్రమైన ఆ రాత్రి అక్కడే గడిపారు.
ఆ రాత్రి గడిచాక రామలక్ష్మణులు స్నానం చేసి, అగ్నిహోత్రాన్ని పూర్తి చేసిన ఆ ఆశ్రమంలోని మునులకి వీడ్కోలు చెప్పారు. అడవిలో నివసిస్తూ, ధర్మాచరణ చేసే ఆ మునులు రామలక్ష్మణులకి చెప్పారు.
‘రామా! ఈ మహారణ్యంలోని దారులన్నీ రాక్షసుల ఉపద్రవాలతో కూడినవి. పురుషులని తినే వివిధ రూపాలు గల రాక్షసులు, రక్తం తాగే క్రూర మృగాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ అడవిలో ఏ మునైనా భోజనానంతరం శుభ్రం చేసుకోకుండా ఉన్నా, ఏమరుపాటుతో ఉన్నా వాడిని రాక్షసులు తినేస్తారు. వాళ్లని తప్పించుకుని వెళ్లు. రామా! పళ్ల కోసం అరణ్యాల్లోకి వెళ్లే మహర్షులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. వెళ్లడానికి శక్యం కాని అడవుల్లోకి నువ్వు ఈ మార్గంలో వెళ్తే అనుకూలంగా ఉంటుంది.’
సీతాలక్ష్మణులతో కలిసి శతృసంహారకుడైన రాముడు ఉత్తమమైన తపస్సు గల ఆ మునులకి దోసిలి కట్టి నమస్కరిస్తూ అడవిలోకి ప్రవేశించాడు. (అయోధ్యకాండ 119)
అయోధ్య కాండ సమాప్తం.
హరిదాసు ఆ రోజుకి అయోధ్య కాండని పూర్తి చేసి రామలక్ష్మణులకి, హనుమంతుడికి హారతి ఇచ్చాక కొందరు శ్రోతలు ఆయన చెప్పిన కథలోని కొన్ని తప్పులని ఎత్తి చూపారు. ఆ తప్పులను మీరు కనుక్కోగలిగారా?
*
మీకో ప్రశ్న

అత్రి మహాముని
కొడుకు ఎవరు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
అత్రి మహాముని తండ్రి ఎవరు?
బ్రహ్మ
*
1.పది సంవత్సరాలపాటు అనావృష్టి వచ్చింది. పాతికేళ్లు కాదు.
2.భర్త శీలం లేనివాడైనా, స్వేచ్ఛగా తిరిగేవాడైనా, దరిద్రుడైనా అతనే దేవుడు అని వాల్మీకి చెప్తే, హరిదాసు ఆప్తుడు అని తప్పు చెప్పాడు.
3.అనసూయతో సీత చెప్పిన ‘సావిత్రి పతి సేవ చేయడం వల్ల స్వర్గంలో పూజింపబడుతోంది’ అన్న మాటలు హరిదాసు చెప్పలేదు.
4.అనసూయతో సీత చెప్పిన ‘సమస్త స్ర్తిలలో ఉత్తమురాలైన రోహిణి చంద్రుణ్ని క్షణకాలమైనా వదిలి ఆకాశంలో కనపడదు.’ అనే మాటల్ని కూడా హరిదాసు చెప్పలేదు.
5.జనకుడు తవ్వింది యజ్ఞ్భూమిని. కాని హరిదాసు ‘్భమిని’ అని మాత్రమే చెప్పాడు.
6.‘సీత నీ కూతురే’ అని పలికింది ఆకాశవాణి. మంత్రులని హరిదాసు చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి