రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం..77

మీకో ప్రశ్న
దశావతారాల్లో ఏకకాలంలో జీవించిన ఇద్దరు అవతార పురుషులు ఎవరు?
---------------------------

సాటిలేని ఆ మునికుమారుడు చంపబడటం గురించి, ధర్మాత్ముడైన దశరథుడు ఏడుస్తూ మళ్ళీ కౌసల్యతో ఇలా చెప్పాడు.
‘అక్కడ ఒంటరిగా ఉన్న నేను అజ్ఞానంతో చేసిన ఆ మహాపాపానికి చలిస్తున్న శరీరంతో దాన్నించి ఎలా బయటపడాలో అని ఆలోచించాను. తర్వాత నేను ముని కుమారుడు చెప్పిన దారిలో ఆ ఆశ్రమానికి చేరాను. అక్కడ నేను ఆ మునికుమారుడి ముసలి, చెవిటి, బలహీనులైన తల్లిదండ్రులని చూశాను. చెయ్యి పట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో వాళ్ళు రెక్కలు నరికిన పక్షుల్లా ఉన్నారు. మరో పనేమీ లేక తమ కొడుకుని గురించిన మాటలే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఉత్సాహం లేని వాళ్ళకి ఉన్న కొడుకు గురించిన ఆశ కూడా నా వల్ల భగ్నమైంది. అంతకు మునుపే శోకంతో బాధపడే మనసుతో, ఏం జరుగుతుందో అని భయపడే నాకు ఆ ఆశ్రమానికి వెళ్ళగానే దుఃఖం అధికమైంది. నా అడుగుల చప్పుడు విన్న ఆ ముని చెప్పాడు.
‘కుమారా! ఆలస్యం చేసావేం? నాకు త్వరగా మంచినీళ్ళు ఇవ్వు, నాయనా! నువ్వు చాలాసేపు నీళ్ళతో ఆడుకోవడం వల్ల మీ అమ్మ బెంగ పెట్టుకుంది. త్వరగా లోపలికి రా.. మీ అమ్మ కానీ, నేను కానీ ఏదైనా తప్పు చేసినా తప్పశ్శాలివైన నువ్వు దాన్ని మనసులో ఉంచుకోకూడదు. గతిలేని మాకు నువ్వే గతివి. కళ్ళు లేని మాకు నువ్వే కళ్ళు. మా ప్రాణాలు నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు మాతో మాట్లాడటం లేదేమిటి?22
ఆ మునిని చూడగానే భయంతో పదాలు కలిసిపోయి, హల్లులు జారిపోయిన అస్పష్ట మాటలతో, తెచ్చిపెట్టుకున్న కొన్ని చేష్టలతో నేను మనసుని బిగబట్టుకుని, ఆ మునీశ్వరుడికి కొడుకు మీద గల ప్రేమ వల్ల కలిగిన భయాన్ని గురించి చెప్పాను.
‘నేను మహాత్ముడైన నీ కొడుకుని కాదు. దశరథుడనే పేరు గల క్షత్రియుడ్ని. చేతులారా చేసిన కర్మతో మంచివాళ్ళకి కీడు తెచ్చి ఈ దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాను. పూజ్యుడా! నేను బాణంతో ఏదైనా క్రూరమృగాన్ని, నీళ్ళకోసం రేవుకి వచ్చే ఏనుగుని చంపాలనే ఉద్దేశ్యంతో నదీ తీరానికి వచ్చాను. అంతలో నాకు నీళ్ళు నిండే కుండ చప్పుడు వినిపించింది. అది సింహం అనుకుని నేను దాన్ని బాణంతో కొట్టాను. తర్వాత నదీ తీరానికి వెళ్లి అక్కడ బాణం ఛాతీలో గుచ్చుకుని ప్రాణాలు పోయి, నేల మీద పడున్న మునిని చూశాను. ధ్వనిని బట్టి గురితో సింహాన్ని చంపాలని నేను వదిలిన బాణంతో నీ కొడుకు చంపబడ్డాడు. నేను అతని దగ్గరకు వెళ్ళి, బాధపడే అతని మాట ప్రకారం అతని మర్మస్థానం నుంచి బాణాన్ని లాగేసాను. వెంటనే అతను తల్లిదండ్రులు, అంధులు అయిన మీ ఇద్దరి గురించి దుఃఖిస్తూ అక్కడే స్వర్గానికి వెళ్ళాడు. అజ్ఞానంతో తొందరపడి నేనే నీ కొడుకుని చంపాను. ఇదలా జరిగిపోయింది. ఈ విషయంలో నేనేం చేయాలో నన్ను ఆజ్ఞాపించు.22
నేను చెప్పిన ఆ దుర్వార్తని విని పూజ్యుడైన ఆ ముని తీవ్ర విచారం కలక్కుండా ఉండలేకపోయాడు. గొప్ప తేజస్సు గల ఆ ముని దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తూ, నిట్టూరుస్తూ, బాధపడుతూ చేతులు జోడించి నిలబడ్డ నాతో చెప్పాడు.
‘రాజా! నువ్వు చేసిన ఈ అశుభాన్ని నువ్వు స్వయంగా వచ్చి నాకు చెప్పకపోతే వెంటనే నీ తల వెయ్యి ముక్కలు అయ్యేది. రాజా! క్షత్రియులు ఎవర్నైనా చంపితే, ముఖ్యంగా వానప్రస్థుడ్ని చంపితే అలాంటి పాపం దేవేంద్రుడ్ని కూడా పదవి నించి తప్పిస్తుంది. తపస్సులో ఉన్న మునిపైన కాని, అలాంటి బ్రహ్మచారి మీద కాని తెలిసి ఆయుధాన్ని ప్రయోగించిన వాడి తల ఏడు ముక్కలవుతుంది. నువీ పనిని తెలీక చేశావు కాబట్టి ఇంకా బతికున్నావు. లేదా నువ్వేమిటి? ఇక్ష్వాకు వంశమే నశించేది. రాజా! మా ఇద్దర్నీ అక్కడికి తీసుకెళ్ళు. రక్తంతో శరీరం తడిసి వస్త్రంగా ధరించిన, జింక చర్మం తొలగి, యముడికి వశుడై, ప్రాణాలు కోల్పోయి, నేల మీద పడి ఉన్న నా కొడుకుని ఆఖరిసారిగా చూడాలని కోరుకుంటున్నాను.22
తర్వాత నేను చాలా విచారించే వారిద్దరినీ అక్కడికి తీసుకెళ్ళాను. ఆ ముని, అతని భార్య తమ కొడుకుని తాకేట్టు చేశాను. తప్పశ్శాలులైన ఆ ఇద్దరూ తమ కొడుకుని తాకాక దాని మీద పడ్డారు. తండి ఇలా చెప్పాడు.
‘కుమారా! ఇప్పుడు నువ్వు నాకు నమస్కారం చేయడం లేదు. మాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకు నేల మీద పడి ఉన్నావు? నా మీద నీకు కోపం వచ్చిందా? నేనంటే నీకు ఇష్టం లేకపోతే నీ తల్లినైనా చూడు. కుమారా! నన్ను కౌగలించుకోవడం లేదేమిటి? ఓ సుకుమారా! నాతో మాట్లాడు. తెల్లవారుఝాము వేదాన్ని కాని, మరొక గ్రంథాన్ని కాని మనోహరంగా చదివే ఎవరి మధురమైన కంఠధ్వని ఇక మీదట నాకు వినిపిస్తుంది? ఇక మీదట ఎవడు స్నానం చేసి, సంధ్యోపాసన తర్వాత అగ్నికార్యం చేసుకుని శోకభయాలతో బాధపడే నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చగలడు? నేను ఏ పనీ చేయకుండా, ఏమీ సంపాదించకుండా, నడిపించే వాళ్ళు లేక కూర్చునే ఉంటే దుంపలు, ఫలాలు తెచ్చి ఎవరు నన్ను ప్రియమైన అతిథిని తినిపించినట్లుగా తినిపిస్తారు? కొడుకుని ప్రేమించే, ముసలిది, గుడ్డిదైన నీ తల్లి చాలా విచారిస్తూ దయనీయ స్థితిలో ఉంది. ఈమెని ఎలా పోషించగలను? కుమారా! ఆగు. యమలోకానికి వెళ్ళద్దు. వెళ్ళద్దు. నాతోను, మీ అమ్మతోను కలిసి రేపు వెళ్దువుగాని. నువ్వు లేకపోవడంతో శోకంతో దీనులమై, ఈ అడవిలో కాపాడే ఎవరూ లేని మేం ఇద్దరం కూడా యమలోకానికి వస్తాము. అక్కడ నేను యముడితో, యమధర్మరాజా! క్షమించు. ఇతను తల్లిదండ్రులని పోషించేట్లు అనుమతివ్వు2అని చెప్తాను. ధర్మాత్ముడు, గొప్ప కీర్తి గలవాడు, లోకపాలకుడైన ఆ యమధర్మరాజు ఇలాంటి స్థితిలోని నాకు ఈ అభయం అనే ఓ దక్షిణని ఇవ్వగలడు. కుమారా! నువ్వు ఏ పాపం లేనివాడివి. అలాంటి నిన్ను ఈ పాపకర్ముడు చంపాడు. ఈ సత్యం చేత ఆయుధాలతో యుద్ధం చేసేవారికి ఏ లోకాలు లభిస్తాయో వాటిని పొందు. యుద్ధంలో వెనక్కి తిరగని శూరులు శత్రువులకి ఎదురుగా నిలబడి, వారి చేత చంపబడి ఏ ఉత్తమగతిని పొందుతారో దాన్ని పొందు. శైభ్యుడు, దిలీపుడు, జనమేజయుడు, నహుషుడు, దుందుమారుడు ఏ గతి పొందారో అలాంటి సద్గతి నీకు లభించుగాక! కుమారా! సమస్తమైన సాధువులకి ఏ గతి లభిస్తుందో, స్వాధ్యా యం వల్ల, తపస్సు వల్ల ఏ గతి లభిస్తుందో, భూదానం చేసినవాడికి, అహితాగ్నికి, ఏకపత్నీవ్రతం పాటించే వాడికి ఏ గతి లభిస్తుందో, వెయ్యి ఆవులని దానం చేసిన వాడికి, పెద్దలని పోషించే వాడికి ఏ గతి లభిస్తుందో, గంగా మొదలైన పుణ్యనదుల్లో ఇష్టాపూర్వకంగా దేహత్యాగం చేసినవారికి ఏ గతి లభిస్తుందో ఆ గతి నీకు లభించు గాక! మన కులంలో పుట్టిన వాడెవ్వడికీ చెడ్డ గతి రాదు. నా కొడుకైన నిన్ను చంపినవాడికే అలాంటి గతి కలుగుతుంది.22
ఇలా ఆ ముని అక్కడ చాలాసేపు ఏడ్చాడు. తర్వాత తన భార్యతో కలిసి అతని కొడుక్కి ఉదకకి యలు చేయడం ఆరంభించాడు. ధర్మవేతె్తైన ఆ మునికుమారుడు తన పుణ్య కర్మల ఫలితంగా దివ్యరూపం ధరించి, దేవేంద్రుడితో కలిసి వెంటనే స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇందు డితో కూడిన ఆ మునికుమారుడు ముసలివాళ్ళతో మాట్లాడాడు. తల్లిదండ్రులని కొద్దిసేపు ఓదార్చి వారితో చెప్పాడు.
‘మీకు సేవ చేయడం వల్ల ఉత్తమగతిని పొందగలిగాను. మీరు కూడా త్వరలోనే నా దగ్గరికి వస్తారు.22
జితేంద్రుడైన ఆ ముని కుమారుడు అందమైన విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. గొప్ప తేజస్సు గల ఆ ముని తన భార్యతో కలిసి జలతర్పణాలు త్వరగా ముగించుకుని, దగ్గరే చేతులు జోడించి నిలబడ్డ నాతో చెప్పాడు. (అయోధ్యకాండ సర్గ 6452 శ్లోకం దాకా)
ఇంటికి తిరిగి వచ్చాక ఆశే్లష తన తల్లి శారదాంబకి తను విన్న కథని చెప్తే ఆవిడ ఇలా చెప్పింది.
‘చూడు. నేను ఎన్ని వేళ్ళు ముడిచానో హరిదాసు అన్ని తప్పులు చెప్పాడు. అవేమిటో కనుక్కోగలవా?22
వెంటనే ఆశే్లష రామాయణాన్ని తీసి అయోధ్యకాండలోని 64వ కాండని చదివి చెప్పాడు.
‘ఆ తప్పులు తెలిసాయి. చెప్తా విను.22
రామాయణం డిటెక్టివ్‌గా మీరు కూడా ఆ ఏడు తప్పులని కనుక్కోగలరా?

* గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
మోదుగ చెట్లని సంస్కృతంలో ఏమంటారు?
కింశుక వృక్షాలు
------------------------------
1. దశరథుడి ఆపద గురించి చెప్తూ, ‘దేవేంద్రుడితో సమానమైన దశరథుడ్ని, రాహువు సూర్యుడ్ని ఆక్రమించినట్లు ఉపద్రవం ఆక్రమించింది.’ అనే ఉపమానాన్ని వాల్మీకి వాడాడు. దీన్ని హరిదాసు చెప్పలేదు.
2. ‘ఏదైనా పనిని ప్రారంభించే ముందు అది మంచిదా, చెడ్డదా అని ఆలోచించి, దాని వల్లకలిగే ఫలాన్ని, దోషాన్ని ఎవడు తెలుసుకోడో వాడు మూర్ఖుడు అని పెద్దలు చెప్తారు’ అని వాల్మీకి చెప్పిన కర్మ సిద్ధాంతం హరిదాసు చెప్పలేదు.
3. మామిడి తోట, జామ తోట కాదు.
4. అప్పటికి దశరథుడు పెళ్ళి కాని యువరాజు. కాని హరిదాసు తప్పుగా ‘పెళ్ళైన కొత్తల్లో’ అని చెప్పాడు.
5. ముని కుమారుడు వైశ్యుడికి, శూద్ర స్ర్తీ కి జన్మించాడు. కాని హరిదాసు తప్పుగా అతను శూద్రుడికి, వైశ్య స్ర్తీకి పుట్టినవాడిగా చెప్పాడు.

-- -మల్లాది వెంకట కృష్ణమూర్తి