రంగారెడ్డి

నిరంతర కృషితోనే క్రీడాకారులకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: క్రీడల్లో రాణించాలంటే నిరంతర కృషి అవసరమని, ఆటల్లో ప్రావీణ్యం కనబరిచినపుడే క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు జీ.కిరణ్‌రెడ్డి అన్నారు. నారాయణగూడలోని కేశవ్ స్మారక ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కళాశాల నిర్వహణలో మంగళవారం జరిగిన ఓయూ ఇంటర్ కాలేజీ ఖోఖో టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దాదాపు 20జట్లు టోర్నీలో పాల్గొన్నాయి. టోర్నీని ప్రారంభించి కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో స్పోర్ట్స్ ఒక భాగం కావాలని, క్రీడలకు ప్రధాన్యత ఇవ్వడం సమాజానికి ఎంతో మంచిదని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు ఐకాన్‌గా ఎదిగే ఆవకాశం ఉందన్నారు. అటలు ఆరోగ్యానికేకాక విద్యార్థులకు వినోదం అందించడంలోనూ, బుద్ధి వికాసం కలిగించడంలోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పాడుతాయని చెప్పారు. క్రీడల వల్ల కలిగే ప్రయోజనాల్ని గుర్తించి ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సాహించాలని, అపుడే వారు రాణిస్తారని సూచించారు. క్రీడలు విద్యార్థుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఆయన అభినందించి సత్కరించారు. టోర్నమెంట్ సమన్వయకర్త పీఈటీ పోచప్ప నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో కశాళా ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరావు, ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ కమిటీ నిర్వహణ కార్యదర్శులు దీప్ల, జగన్‌మోహన్, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైఫీల్ సంఘం అధ్యక్షుడిగా అమిత్‌సింగ్
తెంలగాణ రైఫీల్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. బంజారాహిల్స్‌లో మంగళవారం జరిగిన సంఘం ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షునిగా అమిత్‌సింగ్, ప్రధాన కార్యదర్శిగా జే.కిరణ్, కోశాధికారిగా ఏర్లచేతన్‌రెడ్డి నియమితులయ్యారు. సంఘం సీనియర్ ఉపాధ్యాక్షునిగా గుష్టి నవరియా, ఉపాధ్యాక్షులుగా డారియాస్ చెన్నై, వికార్ అహ్మద్ షఫీక్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ మహ్మద్ సలీంమూసా, మహ్మద్ సోయాలుద్దిన్ ఫారూకీ, కార్యవర్గ సభ్యులుగా జే.ప్రిథ్వీరెడ్డి, బోబ్బిలి నర్సయ్య, ఉదయ్ పిలానిలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైఫీల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

ఉద్యమంలో పాల్గొన్నారా..?
కృష్ణారావు దిష్టి బొమ్మ దగ్ధం
కేపీహెచ్‌బీకాలనీ, సెప్టెంబర్ 18: తెలంగాణ ఉద్యమంలో కూడ పాల్గొనని వ్యక్తికి టీఆర్‌ఎస్ టికెట్టు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు టికెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కేపీహెచ్‌బీకాలనీ టెంపుల్ బస్టాప్‌లో దిష్టిబొమ్మను ఉద్యమకారులు దగ్ధం చేశారు. మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో ఏ రోజు కూడా ఉద్యమంలో పాల్గొన్నలేదన్నారు. నమ్మి ఓట్లు వేసిన ఓటర్లను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో అతనిని ఓడిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పట్లోళ్ల సాయినాథ్‌రెడ్డి, రవినాథ్, సుగుణ, తులసీరెడ్డి, దాసరి రమేష్, కోటేశ్వర్‌రావు, బాబ్జి , కుమారి, ఎస్.కె.మహబూబ్, తలారి రాము, శ్రీ్ధర్, శేఖర్‌రెడ్డి, దినేష్‌నాయుడు, రుక్మిణీ, వీరలక్ష్మీ, శకుంతల లు పాల్గొన్నారు.