రంగారెడ్డి

ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఆరు రోజులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 19: జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమానికి చివరి తేది ఈనెల 25 అని, చివరి తేదీకి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలిందని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. గురువారం మహిళల కోసం ప్రత్యేకంగా ఓటరు నమోదు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని లక్షా 46 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇంటింటికి తిరిగి మహిళలు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా కృషి చేయాలని పేర్కొన్నారు. 24వ తేదీని యువత దినంగా ప్రత్యేక నమోదును చేపట్టనున్నట్లు వివరించారు. 25వ తేదీ వరకు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటరు జాబితాలలో పేరు నమోదైందా లేదా తెలుసుకోవాలని, తప్పులున్న ఎడల సరిదిద్దుకోవాలని, నమోదు కాని వారు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని సిబ్బందికి ఎన్నికల కోసం శిక్షణ ఇచ్చేందుకు డిల్లీలో ఇప్పటికే నలుగురు అధికారులు మాస్టర్ ట్రైనింగ్ పొందుతున్నారని చెప్పారు. అనంతరం గదిలో భద్రపర్చిన ఈవీఎంలను చూపారు. ఈవీఎంలపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ పంచాయతీలలో ఈవీఎంలతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర పాల్గొన్నారు.

అమలు చేయని మేనిఫెస్టోలతో మోసం
ఎల్‌బీనగర్, సెప్టెంబర్ 19: గతంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను మెనిఫెస్టోలో పెట్టి అవేవీ అమలు చేయకుండా మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావడం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నైతిక హక్కులేదని, ప్రజలను మోసం చేస్తుందని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. కొత్తపేట డివిజన్ ప్రజయ్‌నివాస్ ఫేజ్-2లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 5.30లక్షలు ఉంటే 3.90 లక్షల ఓటర్ల కుదించారని, కానీ ప్రస్తుత ఎన్నికలకు 4.65లక్షలకు కుదించారని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండేందుకు జీహెచ్‌ఎంసీ యాప్, టోల్‌ఫ్రీ నంబర్ 1800599299లో నమోదు చేసుకోవాలని, టీడీపీ కార్యాలయంలో కూడా ఓటు నమోదుకు 9100173434, వాట్సాప్ నంబర్‌లు 7032282420, 79932509807ను సంప్రదించి ఓటు హక్కును పొందాలని సూచించారు.
కార్యక్రమంలో సురేందర్ యాదవ్, కొత్తపేట డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, రమాకాంత్‌గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ బాబాయ్, కిరణ్ గౌడ్, మోతీలాల్, రమేష్ చారి, సీతారాములమ్మ, పద్మావతీ పాల్గొన్నారు.

ఎన్నికల ఛర్యలపై ఎస్పీ సమావేశం
వికారాబాద్, సెప్టెంబర్ 19: జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పోలీసు అధికారులతో ఎస్పీ టీ.అన్నపూర్ణ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు. సీసీటీఎన్‌లలో ఎలాంటి పెండింగ్ ఉండకూడదని, పోలీస్‌స్టేషన్‌లలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను, పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులను గురించి పీటీ, ఎన్‌బీడబ్ల్యూ, కంపౌండింగ్ ఈ-పెట్టీ కేసుల వివరాలను, క్వాలిటీ ఆఫ్ ఇనె్వస్టిగేషన్ గురించి ఆయా పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలను ఆన్‌లైన్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలు, డీఎస్పీ శిరీష, తాండూర్ డీఎస్పీ రామచంద్రుడు, డీసీఆర్‌బీ దాస్, ఎస్‌బీఐ, వికారాబాద్, తాండూర్, మోమిన్‌పేట, పరిగి, ధారూర్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, లీగల్ అడ్వైజర్‌లు పాల్గొన్నారు.

ఓటర్ల నమోదును పకడ్బందీగా చేపట్టాలి
కొందుర్గు, సెప్టెంబర్ 19: బూత్ స్థాయి అధికారులు ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లెడ్ చౌదరిగూడ తహశీల్దార్ బాలరాజు అన్నారు. బుధవారం జిల్లెడ్ చౌదరిగూడ తహశీల్దార్ కార్యాలయంలో పొలింగ్ బూత్ స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాలలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల వివరాలు సేకరించి ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేయాలని సూచించారు. ఈనెల 25 లోపు ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు ఆన్‌లైన్ సెంటర్, మీసేవ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని వివరించారు. ఉప తహశీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కొందుర్గు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్‌సాగర్ తెలిపారు.