రంగారెడ్డి

గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ ఎంవీ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, సెప్టెంబర్ 19: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి గణేశ్ నిమజ్జనం, బతుకమ్మ చీరలు, హరితహారం, కంటి వెలుగు పథకాలపై మండల స్ధాయి అధికారులతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 17 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తుండాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రచార ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో గ్రామపంచాయతీలు, పట్టణాల్లో పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో చీరలు భద్రపరచాలని అన్నారు. జిల్లాకు అందిన లక్ష చీరలు కాప్రా, కీసర ప్రాంతాల్లోని గోదాముల్లో భద్రపరిచినట్లు వివరించారు. ప్రతి గ్రామపంచాతీ పరిధిలో నర్సరీని పెంచుకోవాలని, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రర్ధ తీసుకోవాలని కోరారు. నిర్ధేశించిన లక్ష్యాలను శాఖల వారీగా పూర్తి చేయాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో సుధాకర్ రెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్య పాల్గొన్నారు.

ఎన్నికలకు ప్రోత్సహిస్తున్న
పార్టీ నాయకులు, కార్యకర్తలు
వికారాబాద్, సెప్టెంబర్ 19: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అవకాశమిస్తే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల ఆశీర్వాదంతో వికారాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తామని టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వీ.నందు అన్నారు.
బుధవారం నందు మద్దతుదారులతో తాండూరు వెళ్లి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని కలిసారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నందు మాట్లాడుతూ తనను ఎన్నికల్లో పోటీ చేయాలని ఐదు మండలాలతో పాటు పట్టణ నాయకులు, కార్యకర్తలు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సమావేశంలో ధారూర్ పీఏసీఎస్ అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎస్.ఎల్లా రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త నర్సింలు, ఎంపీటీసీ సాయన్న, మైనారిటీ సెల్ నాయకుడు యూనస్, నాయకులు ఆంజనేయులు, పాండు, మాజీ సర్పంచ్ లక్ష్మయ్యలు పాల్గొన్నారు.

23న డయాబెటిక్ అంశంపై కార్యక్రమం
హైదరాబాద్, సెప్టెంబర్ 19: డయాబెటిక్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో 23న డయాబెటిక్ అండ్ హైపర్‌టెన్షన్ కెన్ స్ట్రైక్ ఐస్ - కేర్ అండ్ మేనే జ్‌మెంట్ అంశంపై కార్యక్రమం ఉంటుందని కన్వీనర్లు ఎన్.ప్రభాకరం, కృ ష్ణారెడ్డి, సీవీ కృష్ణారావు తెలిపారు. సోమాజిగూడ విజయా డయగ్నస్టిక్స్‌లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారం భమవుతుందని, ముఖ్యవక్తగా ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి కన్సల్టెంట్ డా.పద్మజ కుమారి ప్రసం గిస్తా రని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 19: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య అన్నారు. బుధవారం అత్తాపూర్ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్ భవనం వద్ద నిర్వహించిన కంటి వెలుగు పరీక్షలలో పాల్గొన్నారు. వార్డు కమిటీ సభ్యులు మధుబాబు, రవీందర్‌కుమార్, డాక్టర్ దివ్య, నాగేశ్వరి పాల్గొన్నారు.