రంగారెడ్డి

గణేష్ నిమజ్జనం వేడుకలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 20: గణేష్ నిమజ్జనం వేడుకలకు మండప నిర్వాహుకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 23న నిర్వహించే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక నిఘాతో పకడ్భందీగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతి గణేష్ మండపం వివరాలను సేకరించి పర్యవేక్షణ చేస్తున్న పోలీసులు నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులను కోరుతున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాలలో కొలువైన విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేసేందుకు వరంగల్ జాతీయ రహదారిలోని నల్ల చెరువులో ప్రత్యేక కొలను ఏర్పాటు చేశారు. వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడిని నగరంలోని వినాయక సాగర్, సరూర్‌నగర్, ఎదులాబాద్, సఫిల్ గూడ లేదా నాగార్జున సాగర్, శ్రీశైలంలో నిమజ్జనం చేయనుండగా చిన్న విగ్రహాలను ఉప్పల్ నల్ల చెరువులో నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. చివరి రోజు మిగితా విగ్రహాలను నిమజ్జనం చేస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తుతో పాటు సౌకర్యాలను కల్పించారు. నిమజ్జనం వేడుకల సందర్భంగా వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేందుకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్‌రోడ్డు, రామంతాపూర్‌లో స్వాగత వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఘట్‌కేసర్ వైపు నుంచి వినాయక సాగర్‌కు వెళ్లే గణేష్ విగ్రహాలతో వచ్చే భక్తులకు పులిహోర, టిఫిన్, తాగు నీరు సౌకర్యాలను కల్పించేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థల అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘం, ఇతర స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి. కన్నుల పండువగా జరిగే శోభా యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ నిర్వాహకులు కోరుతున్నారు.

ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు
కాచిగూడ, సెప్టెంబర్ 20: ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని తెలంగాణ బీసీ కమీషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. మాస్టర్ జీ.సాయి తపష్ నాన్‌స్టాప్‌గా 40 నిమిషాలు వివిధ రకాల భావోద్వేగ నృత్య ప్రదర్శన చేసి తొలి ‘డౌన్ సిండ్రోమ్’ కిడ్‌గా రికార్డు సాధించిన సందర్భంగా జీసియస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జ్యోతి కల్చరల్ అసోసియోషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా సుబ్బరావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వకుళాభరణం కృష్ణ మోహన రావు మాట్లాడుతూ పిలల్లో దాగిన సృజనాత్మకతను వెలికితీసి వారికి అయా రంగల్లో శిక్షణ ఇస్తే డౌన్ సిండ్రమ్ కిడ్స్ సమాజంలో ఎంతో మంది వస్తారని అకాక్షించారు. తొలి డౌన్ సిండ్రోమ్ సాయి తపష్ రికార్డు సాధించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. సాయి తపష్ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించగా లయన్ విజయ్ కుమార్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, సంస్థ అధ్యక్షురాలు పుష్పలత పాల్గొన్నారు.

ప్రభుత్వ తీరును ఎండగట్టాలి
తలకొండపల్లి, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో మార్పు తీసుకరావలని, కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి అన్నారు. పల్లెపల్లెకు బీజేపీలో భాగంగా తలకొండపల్లి మండల కేంద్రంలో బీజేపీలో గురువారం తలకొండపల్లి, వేల్జాల్ గ్రామాల నుంచి విశ్వబ్రాహ్మాణులు, గిరిజనులు చేరారు. బక్కి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆచారి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు శానమోని పాండు, పాండుప్రసాద్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, గెలవలయ్య, నరసింహా, లక్ష్మయ్య, యాదయ్య, కూమార్ పాల్గొన్నారు.

పర్వతనేని సాంబశివ రావుకు
‘కినెనర - అక్కినేని’ పురస్కారం ప్రదానం
కాచిగూడ, సెప్టెంబర్ 20: డా.అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు పర్వతనేని సాంబశివ రావుకు ‘కినె్నర - అక్కినేని’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని పర్వతనేని సాంబశివ రావుకు పురస్కారం ప్రదానం చేసి ప్రసంగించారు. పర్వతనేని సాంబశివ రావు కుంబుకథా చిత్రలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.
అక్కినేని తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపొతాయరని తెలిపారు. అక్కినేని పురస్కారం ప్రదానం చేయడం సముచితమని పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు త్రినాథ రావు నిర్వహణలో నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ప్రజానటి జమున, సినీ నటుడు గిరిబాబు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకుడు రేలంగి నరసింహా రావు, నటుడు జీవీ నారాయణ రావు, రచయిత సీఎస్ రావు, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.