రంగారెడ్డి

ఒకే వర్గంగా ఏర్పడనున్న అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 20: టీఆర్‌ఎస్ అభ్యర్థిగా స్థానిక మాజీ శాసనసభ్యుడు ఎల్గనమోని అంజయ్య యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసినప్పటి నుంచి అసమ్మతి నేతల సంఖ్య క్రమంగా పెరుగుతునే ఉంది. నిర్వహించనున్న ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్‌కు మద్దతు ఇవ్వాలని వీర్లపల్లి వర్గం సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్‌ను కోరినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అసమ్మతి నేతలు ఒక్కటై పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థులను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తొంది. టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గంలో రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్‌లో మాజీ మంత్రి డాక్టర్ పీ.శంకర్ రావు, నేత కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ఏకమై వీర్లపల్లి శంకర్‌కు మద్దతు ఇస్తున్నట్లు రాజకీయ విశే్లషకులు చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్నికల బరిలో రెబల్‌గా వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య, మాజీ మంత్రి శంకర్ రావు, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ఇవ్వడంతోపాటు గెలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రచారం వేగవంతం చేయాలి
* స్థానిక నాయకులను అదేశించిన కేసీఆర్
టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎల్గనమోని అంజయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించిన విషయాన్ని రాష్ట్ర టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్లారు. అసమ్మతి నేతల విషయాన్ని నేను మాట్లాడగలనని, మీరు ఎన్నికల ప్రచారం వేగవంతం చేయాలని, గ్రామాలలో టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధి గ్రామీణ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రచారం ముమ్మరంగా చేయాలని స్థానిక నాయకులకు కేసీఆర్ అదేశించారు. అసమ్మతి నాయకులను బుజ్జగింపు కార్యక్రమం టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని, త్వరలో అసమ్మతి నాయకులకు కేసీఆర్ నుంచి ఫోన్ ద్వారా పిలిచి సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్గీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

‘అమరావతి’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, సెప్టెంబర్ 20: ప్రముఖ రచయిత పద్మశ్రీ అచార్య కొలకలూరి ఇనాక్ రచించిన ‘అమరావతి’ పుస్తకావిష్కరణ సభ విమల సాహితీ సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వ రావు పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్య రంగల్లో అనేక సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సాహిత్య రంగంల్లో ఎంతో పరశోధనలు చేసి రచనలు చేశారని తెలిపారు. ప్రముఖ కవి రమణ వెలమకన్ని సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఏనుగు నర్సింహా రెడ్డి, జీవీఆర్ ఆరాధన అధ్యక్షుడు గుదిబండి వెంకట రెడ్డి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, కవి రత్నాకర్, రచయిత పెద్దూరి వెంకటదాసు, సంస్థ అధ్యక్షుడు జెల్ది విద్యాధర రావు పాల్గొన్నారు.