రంగారెడ్డి

సాంకేతిక పరిజ్ఞానంతో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 22: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాణించాలని.. కష్టపడి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మైసమ్మగూడ గ్రామంలో గల మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం బీఓటీ ల్యాబ్‌ను ఎంపీ ప్రారంభించడంతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను ప్రధానం చేశారు. ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి పట్టుదలతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలని అన్నారు. సాంకేతిక పరిఙ్ఞనంతో ఐడియాను జోడించి, ఆమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ తదితర కంపెనీలు నేడు ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో నిలిచాయని వివరించారు. నేడు సాంకేతిక పరిఙ్ఞనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఎప్పటికప్పుడు మార్పులకనుగుణంగా పరిఙ్ఞనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో కూడా పట్టు సాధించాలని అన్నారు.
విద్యార్థినులు తాము మహిళలమనే భావనను విడనాడి కేవలం ఇంజనీర్‌లమనే భావనతో ముందుకు సాగాలని చెప్పారు. ఆటోమేషన్ ఎనీవేర్ యూనివర్సిటీ గ్లోబల్ వీపీ అరవింద్ మాట్లాడుతూ నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ బిజినెస్ హెడ్ పారస్ బన్సాల్ మాట్లాడుతూ విషయ పరిజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో ప్రాదాన్యత ఉందని అన్నారు. ప్రిన్సిపాల్ మాధవీలత, రఘురాం రెడ్డి, కేఎస్ శర్మ పాల్గొన్నారు.

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
వికారాబాద్, సెప్టెంబర్ 22: వినాయక చవితి నుండి నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడు ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు. వివిధ కాలనీలు, వాడల్లో మండపాలలో ఏర్పాటు చేసిన వినాయకుడిని డప్పుల చప్పుళ్లు, ఆనంద నృత్యాలు, ఆటాపాటల మధ్య వాహనాల్లో ఊరేగించేందుకు యువత ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ మొదలు మహిళా హోంగార్డు వరకు దాదాపు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మున్సిపల్ అధికారులు నిమజ్జనానికి రూట్ మ్యాప్ తయారు చేశారు. ముందుగా గాంధీగంజ్ నుంచి బయలుదేరే వినాయకుల వాహనాలు మహాశక్తి, రైల్వే స్టేషన్, బస్టాండ్ రోడ్, రామయ్యగూడ రోడ్డు మీదుగా ధారూర్ మండలం ఎబ్బనూరు చెరువుకు చేరుకుంటాయి. పట్టణంలోని రోడ్లన్నీ వెలుగులతో నిండిపోవాలని మున్సిపల్ ఎలక్ట్రికల్ విభాగం ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుంతలు పడిన రోడ్లను ఆర్‌అండ్‌బీ సిబ్బంది చిన్నపాటి మరమ్మతులతో మూసారు. నిమజ్జనం సందర్భంగా ఆలంపల్లి రోడ్డు, పాతగంజ్‌లలో వివిధ అసోసియేషన్‌లు, రాజకీయ పార్టీలు, మిత్రమండలిలు స్వాగత వేదికలు ఏర్పాటు చేసి వినాయకుకలకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నిమజ్జనోత్సవంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ, డీఎస్పీ శిరీష, మున్సిపల్ కమిషనర్ బీ.సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ హెచ్.సురేష్, 24వ వార్డు కౌన్సిలర్ ఏ.సుధాకర్ రెడ్డి, సీఐ సీతయ్య, పట్టణ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ వెళ్లి ఎబ్బనూరు చెరువును పరిశీలించారు.