రంగారెడ్డి

కన్నుల పండువగా మహాగణపతి నిమజ్జనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వనాల మధ్య పార్వతీ తనయుడు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. పది రోజుల పాటు శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శనమించిన ఏకదంతుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల సూచన మేరకు నిర్ధేశించిన సమయంలోనే మహాగణపతి నిమజ్జనాన్ని పూర్తిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే గణపతికి పైభాగంలో నిర్మించిన షెడ్‌ను తొలగించిన నిర్వాహకులు, శనివారం వెల్డింగ్ పనులను పూర్తి చేశారు. చివరి రోజు సరస్వతి, లక్ష్మి సమేత గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చిన పోలీసులు అనంతరం దర్శనాన్ని నిలిపి వేశారు. 12గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒకటిన్నరకు సమయంలో కలశాన్ని జరిపారు. గణపతికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విగ్రహాలను పక్కకు జరిపారు. అనంతరం 57 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీసప్తముఖ కాల సర్ప మహాగణపతిని బ్రహ్మముహూర్తంలో భారీ క్రైన్ సహాయంతో ట్రాయిలర్ వాహనంపైకి చేర్చారు. ఉదయం 7:05 నిమిషాలకు శోభాయాత్ర ప్రారంభం అయింది. మంగళవాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాల నడుమ గణనాథుడు మునుముందుకు సాగిపోయాడు. వార్డు కార్యాలయం, బడే మజీద్ మీదుగా 8:20 నిమిషంలో ముషిక వాహనుడు వాసవీ సేవా కేంద్రం వద్దకు చేరుకున్నాడు. గణనాథుడికి నలువైపులా భక్తుల కోలాహలం చేస్తుండగా వడివడిగా శోభాయాత్ర కొనసాగింది. 9:10 ప్రాంతంలో రాజ్‌ధూత్ చౌరస్తాకు చేరుకొని టెలిఫోన్ భవన్, సెక్రెటరియేట్ మీదుగా ఎన్‌టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. భారీ గణనాధుడు ఎన్‌టీఆర్ మార్గ్‌కు చేకోగానే అప్పటికే నిమజ్జనం చేసేందుకు వచ్చినవారు వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా కేరింతలు, గణపతి బొప్పమోరియా గణపతి వాహనం వెనుక నడిచారు. నిర్ధేశించిన ఆరవ నెంబర్ క్రైన్ వద్దకు చేరుకుంది. మహాగణపతి నిమజ్జనాన్ని ప్రత్యేక్షంగా వీక్షించేందుకు వచ్చిన భక్తులతో ఎన్‌టీఆర్ మార్గ్ భక్తజన సంద్రంగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రహదారులు కిక్కిరిసిపోయాయి. సుమారు 11:15 గంటల ప్రాంతంలో క్రైన్ వద్దకు చేరుకున్న గణనాథుడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్.. ఉత్సవ