రంగారెడ్డి

నృపతుంగ ప్రీప్రైమరీ స్కూల్ ఫెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 20: చిన్నారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ‘మేరి కళాకారి ఫెస్ట్’ ఎంతోగానో ఉపయోగపడుతుందని కర్ణాటక శిక్షణ సమితి అధ్యక్షుడు విఠల్ జోషి అన్నారు. కర్ణాటక శిక్షణ సమతి ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడ నృపతుంగ ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ‘మేరి కళాకారి’ పేరిట ఇంటర్ ప్రైమరీ స్కూల్ ఫెస్ట్ 2018 కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, కానీ వారిలో ఉన్న ప్రతిభను గుర్తించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో రాణించాలని సూచించారు. నర్సరీ విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, హ్యాండ్‌రైటింగ్, కలరింగ్‌తో పాటు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించారు. కాచిగూడ పరిసర ప్రాంతాల్లోని 12 ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కర్ణాటక శిక్షణ సమితి కార్యదర్శి మీరా జోషి, కోఆర్డినేటర్ అంబుజ కులకర్ణి, ఆపర్ణ, స్కూల్ ఇన్‌చార్జి సురేంద్ర కులకర్ణి, కిషన్ రావు పాల్గొన్నారు.

నాయాబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆమనగల్లు, నవంబర్ 20: నాయాబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కానుగుల దశరథంను మంగళవారం ఆమనగల్లు మండల నాయాబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నాయాబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్సలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సన్మానించినవారిలో అధ్యక్షుడు పెరికిట యాదయ్య, కార్యదర్శి రమేశ్, రామ చంద్రయ్య, కోటయ్య, నర్సింహ, బాలయ్య పాల్గొన్నారు.

సీఓపీడీ వ్యాధిపట్ల అప్రమత్తత
* నిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి పరంజ్యోతి సూచన
ఖైరతాబాద్, నవంబర్ 20: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలిగించి చివరకు ప్రాణాలను హరించే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనాలజీ డిసీజ్ (సీఓపీడీ) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిమ్స్ పల్మనాలజి విభాగాధిపతి పరంజ్యోతి పేర్కొన్నారు. ప్రపంచ సీఓపిడీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వ్యాధి లక్షణాలు - నివారణ చర్యలను శ్వాసకోశ నిపుణులు మహబూబ్ ఖాన్‌తో కలిసి వివరించారు. ఊపిరితిత్తులకు గాలిని చేర వేసే నాళాలకు సోకే వ్యాధి సీఓపీడీ అని చెప్పారు. శ్వాస నాళాలకు ఏర్పడ్డ అడ్డంకులవల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందదని దీంతో ఒక్కో అవయవం పాడవుతుందని చెప్పారు. ధూమపానం, వాతావరణ కాలుష్యంతో ఈ వ్యాధి సోకుతుందని చెప్పారు. నానాటికీ ఈ వ్యాధి భారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు. గతంలో కేవలం మగవారిలోనే కనిపించిన ఈ వ్యాధి ప్రస్తుతం మహిళల్లో అధికంగా కనిపిస్తుందని చెప్పారు. పూర్తిస్థాయిలో నయం చేసే చికిత్సలు లేనందున నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

చంద్రబాబును విమర్శిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి
శేరిలింగంపల్లి, నవంబర్ 20: టీడీపీ అధినేత చంద్రబాబును తిడుతున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి టీఆర్‌ఎస్‌ను ఓడించాలని శేరిలింగంపల్లి టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం మదీనగూడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీనియర్ నేతలు ప్రత్యర్థులపై పలు ఆరోపణలు చేశారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అక్బర్ ఖాన్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి మోహన్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ భానుప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాంధీని 76వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే కార్యకర్తలకు కూడా చెప్పకుండా తన స్వలాభం కోసం అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. పార్టీ నాయకుడు మొవ్వా సత్యనారాయణ సైతం టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల ఆనంద ప్రసాద్ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డివిజన్‌ల అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, శివగౌడ్, డీఎస్‌ఆర్‌కే ప్రసాద్, నరేందర్ ముదిరాజ్, అట్లూరి చిట్టిబాబు, నాగసురేష్, ధనలక్ష్మి పాల్గొన్నారు.