రంగారెడ్డి

నమోదైన కేసులను సీసీటీఎన్‌లో అప్‌లోడ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 18: నమోదైన కేసు వివరాలను సీసీటీఎన్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నమోదైన కేసుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న యూఐ కేసుల గురించి పీటీ, ఎన్‌బీడబ్ల్యూ, కంపౌండింగ్, ఈపిట్టీ కేసుల వివరాలు, క్వాలిటీ ఆఫ్ ఇనె్వస్టిగేషన్ గురించి ఆయా పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలను ఆన్‌లైన్ రివ్యూ చేశారు. డీజీపీ ప్రతి రోజు ఒక్కో జిల్లాలో నమోదైన కేసుల గురించి సమీక్ష చేస్తున్నారని చెప్పారు. సంబంధిత అధికారులకు తెలియజేసిన తర్వాతే ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని చెప్పారు.
ఫిర్యాదు దారులకు కేసుల పరిస్థితిని ఎస్‌ఎంఎస్ ద్వారా తెలిపి సమాజంలో పోలీసుల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. వ్యక్తిపై కేసు నమోదై ఆరు నెలలు కనిపించకపోతే ఓవీ కార్డు తెరిచి, బార్డర్ పీఎస్‌లకు మెమోల ద్వారా తెలియజేయాలని వివరించారు. రిస్క్యూహోం, చిల్డ్రన్ హోంలకు వెళ్లి వారి ఫొటోలను సీసీటీఎన్‌లో అప్‌లోడ్ చేయాలని, దీని ద్వారా మిస్సింగ్ కేసులు ఛేదించవచ్చని తెలిపారు. పీఎస్ పరిధులలో మహిళలపై పోక్సో, ఇతర కేసులో వారిని భరోసా సెంటర్‌కు పంపాలని అన్నారు. పనిభారం పడకుండా పని విభజించుకోవాలని, సంబంధిత అధికారులకు పనిని అప్పగించామని చెప్పారు. కమ్యూనిటి పోలిసింగ్, నేను సైతం కార్యమ్రాల్లో పీఎస్ పరిధిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి వివరించి అధికారులు, ప్రజా ప్రతినిధులకు సీసీ కెమెరాల ద్వారా కలిగే ఉపయోగాలను తెలిపి, సీసీ కెమెరాల ఏర్పాటులో తోడ్పడేలా చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పరమాల నర్సింలు, వికారాబాద్, పరిగి డీఎస్పీలు శిరీష, శ్రీనివాస్, సీసీఎస్ సీఐ శ్రీనివాసులు, పీసీఆర్ సీఐ శ్రీనివాసులు, డీసీఆర్‌బీ సీఐ దాసు, వివిధ పోలిస్ స్టేషన్‌ల సీఐలు, ఎస్‌ఐలు, లీగల్ అడ్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్‌ల పనితీరు మెరుగుకు సీఆర్‌పీసీ చట్టాలపై పరీక్ష నిర్వహించారు.