హైదరాబాద్

రసాభాసగా అఖిలపక్ష సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 27: జిహెచ్‌యంసి ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న ప్రక్రియలో భాగంగా బిసి గణనపై శుక్రవారం ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా జరిగింది. జోనల్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరై అభ్యంతరాలను వెల్లడించారు. జిహెచ్‌యంసి పరిధిలో బిసి గణనను హడావుడిగా నిర్వహించారని, దీంతో ప్రస్తుతం రూపొందించిన జాబితా తప్పులతడకగా ఉందని అన్నారు. ఓటర్ల జాబితా సైతం గందరగోళంగా తయారైందని నాయకులు వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో సుమారు 52 శాతం బీసీలు ఉన్నట్టు ప్రకటించగా ప్రస్తుతం 26 శాతానికి ఎలాపడిపోయిందని ప్రశ్నించారు. జిహెచ్‌ఎంసి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నాయకుల భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బిసి గణనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పని ఒత్తిడి, సరైన సిబ్బంది లేమి సైతం దీనికి కారణంగా కనిపిస్తుండగా, కొన్ని ప్రదేశాల్లో హోటల్స్, పబ్లిక్ ప్రాంతాల్లో కూర్చొని బిసి గణన పూర్తిచేస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటికి స్పందించిన గౌరవ్ ఉత్పల్ బిసి గణన ఇదే చివరిది కాదని, అభ్యంతరాలు స్వీకరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఏఏ ప్రాంతాల్లో తప్పుల తడకగా ఉన్నాయో తెలుసుకొని తిరిగి సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. బిసి గణన కోసం సర్వేకు వచ్చే సిబ్బందికి స్థానిక రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరారు. సర్వేను మధ్యాహ్నం కాకుండా ఉదయం, సాయంత్రాల వేళ నిర్వహించాలని కోరారు. ఇంటిల్లిపాది పనిచేస్తేనే జీవించలేని మహానగరంలో సర్వేకు వచ్చిన సమయంలో ఎవరూలేరన్న కారణాన్ని చూపుతూ ఓట్లను తొలగించడం సరికాదని కమిషనర్‌కు విన్నవించారు. దీనికి స్పందించిన కమిషనర్ సాధ్యమైనంత వరకు సర్వేను జాగ్రత్తగా చేస్తున్నామని, ఓటర్ జాబితాలో తొలగింపులపై ఆందోళన అసలే అవసరం లేదని హామీ ఇచ్చారు. జిహెచ్‌యంసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓట్లను నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు ప్రభాకర్ రెడ్డి, లల్లూ ముదిరాజ్, మధుకర్ యాదవ్, పివిఎల్‌ఎన్ శాస్ర్తీ పాల్గొన్నారు.

కాలుష్యాన్ని వెదజల్లుతున్న సంస్థపై చర్యలు తీసుకోవాలి
ఖైరతాబాద్, నవంబర్ 27: ప్రజల ప్రాణాలను హరించే విధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న నిజామాబాద్ జిల్లాలోని గాయత్రీ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్షక, కార్మిక పర్యావరణ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి నాయకులు వెంకటరామిరెడ్డి, నర్సింహారావు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ పేరుతో అనుమతులు తీసుకున్న సదరు సంస్థ అనంతరం డిస్టిలరీ కంపెనీని ప్రారంభించి పరిసరాలను కాలుష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పరిశ్రమ ఉన్న మర్కల్ మండలంతో పాటు సమీప గ్రామాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకొని తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్ధాలను నేరుగా బయటకు పంపిస్తుండటంతోనే ఈ తరహా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. 2008 నుంచి తమ గ్రామాలను కాలుష్యం నుంచి రక్షించాలని అప్పటి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ అధినేతలకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరమైనా తమ బాధలు తీరుతాయని అనుకుంటే ఇప్పటికీ అదే తరహా బాధలను అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. వ్యర్ధాలను తొలగించే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూడాలని కోరారు.