విశాఖపట్నం

12 నుండి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 26న రథయాత్ర
విశాలాక్షినగర్, డిసెంబర్ 8: ఉత్తరాంధ్రలోని భక్తుల పాలిట ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు 12వ తేదీ నుండి వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎస్ జ్యోతి మాధవి తెలిపారు. మంగళవారం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థాన ఆవరణలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారకి మార్గశిర మాసం ప్రీతికరమైనదని అందువలన లక్షలాది మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోందన్నారు. శ్రీ మన్మథ నామ సంవత్సర మార్గశిర పాఢ్యమి స్థిరవారం ఈనెల 12వ తేదీ నుండి వచ్చే ఏడాది మార్గశిర అమావాస్య ఆదివారం జనవరి 10వ తేదీ వరకూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు జరపడానికి వేద పండితులు నిర్ణయించారని వెల్లడించారు. ఈ నెల 12న ఉదయం 9.15 నిమిషాలకు మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. దీనిలో భాగంగా వేద మంత్ర పఠనంతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణాలు, వేద పారాయణాలు, శ్రీ చక్రార్చన, లక్ష్మీహోమంతో మార్గశిర మాస ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. భక్తులు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారిని దర్శించుకోడానికి ప్రతీరోజూ 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశముందన్నారు. ప్రతీ గురువారం రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజల్లో పాల్గొంటారని తెలియజేశారు. విఐపి దర్శనం, విశిష్ట, పండుగ దర్శనాల పేరుతో అందరికీ అమ్మవారి దర్శనం లభిస్తుందన్నారు. వాహనాల పార్కింగ్‌కు కొత్తరోడ్డు పోస్ట్ఫాసు, పంజా జంక్షన్, గోషా హాస్పటల్ రోడ్లలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఉందన్నారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పూలతో అలంకరించిన రథంలో అమ్మవారి ఊరేగింపు, రథయాత్ర వైభంగా నిర్వహిస్తామన్నారు. అమ్మవారి మాలధారణ మాతలు పూర్ణ కళశాలతో జగదాంబ సెంటర్ అంబికాబాగ్ దేవాలయం నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వరకూ రథయాత్ర వైభవంగా కొనసాగుతుందన్నారు. 27న సాయంత్రం వేద పండిత సభ జరగనున్నదన్నారు. జనవరి 7వ తేదీన జగన్నాథస్వామి ఆలయ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని జ్యోతి మాధవి వెల్లడించారు.