రంగారెడ్డి

పండక్కి అందని రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారుల నిర్లక్ష్యం
నిబంధనలు బేఖాతర్
సామాన్యుడి సతమతం

వికారాబాద్, మార్చి 7: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పౌరసరఫరాల అధికారుల వ్యవహార శైలి ఉంది. ప్రతినెల ప్రభుత్వం చౌకధర దుకాణాల నుంచి అందించే బియ్యం, పప్పు, పంచదార ఆలస్యంగానే అందుతున్నాయి. శివరాత్రి పర్వదినం ఉందని తెలిసినా అధికారుల నిర్లక్ష్యంతో బియ్యం, పంచదార, పప్పులు అందనేలేదు. ప్రతి నెల 30వ తేదీలోపు నిత్యావసర వస్తువులు రేషన్ దుకాణాలకు చేరాలని, ఐదోతేదీలోపు లబ్ధిదారుడికి అవి చేరాలన్న నిబంధనను అధికారులు, రేషన్‌డీలర్లు తుంగలో తొక్కుతున్నారు.
రేషన్‌డీలర్లు తప్పులు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో. పామాయిల్ ఎలాగూ ఇవ్వడం లేదు. కనీసం ఇచ్చే బియ్యం, పప్పు, పంచదారైనా సమయానికి ఇవ్వాలని రేషన్‌కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ దుకాణాలను ప్రజాప్రతినిధులు తనిఖి చేసి డీలర్లను దారిలో పెట్టాలని ఐఎఎస్ అధికారులు సైతం సూచిస్తున్నావారు సైతం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా డీలర్లు ఆడిందే పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. అందుకే అక్కడక్కడ తరలించబడుతున్న రేషన్ పట్టివేత, రీపాలిషింగ్ బియ్యం పట్టుబడటం సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.