జాతీయ వార్తలు

దళిత పారిశ్రామికవేత్తలకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. కిషోర్‌బాబు మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన జాతీయ దళిత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) సమావేశం విజయవంతమైందన్నారు. మంత్రి ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరయ్యారు. దళిత పారిశ్రామికవేత్తలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిలబెడతారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడటం తమకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిందని కిషోర్‌బాబు తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా దళిత చాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర ప్రభుత్వంతో కీలక ఎంఓయు కుదుర్చుకుందని మంత్రి చెప్పారు. దళితుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులను సమర్ధవంతంగా ఖర్చు చేసినట్లు కిషోర్ బాబు వెల్లడించారు. ఎస్‌సి, ఎస్‌టిలు ఉద్యోగాల కోసం నిలబడే బదులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగి రావాలంటూ నరేంద్ర మోదీ పిలుపునివ్వడం ముదావహం అన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ 2014-15 సంవత్సరానికి ఇప్పటి వరకూ 1000 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. అందులో 440 కోట్ల రూపాయలను వౌలిక వసతుల కల్పనకు ఉపయోగించటం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఎస్‌సి కార్పొరేషన్‌కు కేవలం 60 కోట్లు కేటాయిస్తే తెలుగుదేశం ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని రావెల చెప్పారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రైవేట్ సంస్థల సహకారం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. (చిత్రం) ఢిల్లీలో మంగళవారం జరిగిన దళిత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి రావెల కిశోర్ బాబు