క్రీడాభూమి

పిచ్‌లు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట మార్చిన టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తి
న్యూఢిల్లీ, నవంబర్ 30: పిచ్‌లపై నిన్నమొన్నటి వరకూ విమర్శలు గుప్పించిన టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తి మాట మార్చాడు. టెస్టు మ్యాచ్‌లు జరిగిన మొహాలీ, బెంగళూరు, నాగపూర్ పిచ్‌లపై వచ్చిన విమర్శలను అతను తోసిపుచ్చాడు. పిచ్‌లు అద్భుతమని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవి శాస్ర్తి చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి-20, వనే్డ సిరీస్‌లను భారత జట్టు చేజార్చుకున్నప్పుడు రవి శాస్ర్తి పిచ్‌ల తీరుపై విరుచుకుపడ్డాడు. ముంబయి వాంఖడే స్టేడియం క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న మాజీ టెస్టు క్రికెటర్ సుధీర్ నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాసిరకమైన పిచ్ అంటూ వాంఖడే మైదానంపై అసహనం ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికాకు అనుకూలమైన పిచ్‌ని తయారు చేశాడంటూ సుధీర్ నాయక్‌పై విమర్శనాస్త్రాలు గుప్పించాడు. అయితే, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో, రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, మొదటి, మూడో టెస్టుల్లో భారత్ విజయభేరి మోగించడంతో అతను మాట మార్చాడు. పిచ్ తీరు నిరాశ పరచిందని, బంతి ఏ దిశగా వస్తున్నదో కూడా అర్థంగాని స్థితిలో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా వ్యాఖ్యానించాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగియడం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో టెస్టు మ్యాచ్‌ల కోసం సిద్ధం చేసిన పిచ్‌ల తీరుపై దుమారం చెలరేగింది. అయితే, పిచ్‌లు బాగున్నాయని, తప్పుపట్టడానికి ఎలాంటి ఆస్కారం లేదని రవి శాస్ర్తీ వ్యాఖ్యానించాడు. ఐదు రోజుల మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడాన్ని కూడా అతను సమర్ధించాడు. పోటాపోటీగా సాగే ఆటను తిలకించేందుకే అభిమానులు ఇష్టపడతారని, అందుకే టికెట్ కొనుక్కొని స్టేడియాలకు వస్తారని అన్నాడు. ఐదు రోజుల పాటు మ్యాచ్ కొనసాగి తీరాలన్న ఆలోచనకు స్వస్తి పలకాలని హితవు చెప్పాడు. సాంకేతిక పరమైన అంశాలే బ్యాట్స్‌మెన్‌ను వేధిస్తున్నాయని, పిచ్‌ల వల్ల ఎలాంటి సమస్య లేదని అన్నాడు. క్రీజ్‌లో పాతుకుపోవడం, గంటల తరబడి బ్యాటింగ్ చేయడం వంటి విధానాలకు కాలం చెల్లిందన్నాడు. వనే్డ మ్యాచ్‌ల మాదిరిగానే టెస్టుల్లోనూ ఇన్నింగ్స్ త్వరగా పూర్తయితేనే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ బలపడుతున్నదని అన్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది కలిగితే, అదే పిచ్‌పై టీమిండియా ఆటగాళ్లు కూడా బ్యాటింగ్ చేశారుకదా అని ప్రశ్నించాడు. తక్కువ స్కోర్లు నమోదు కావడం అన్నది బ్యాట్స్‌మెన్ టెక్నిక్‌లో ఉన్న లోపమేనని అన్నాడు. నాగపూర్ పిచ్‌పై బంతి విపరీతంగా బౌన్స్ కావడం వల్ల సమస్యలు తలెత్తాయన్న వాదనను కూడా రవి శాస్ర్తీ ఖండించాడు. సమస్య అన్నది ఒక జట్టుకు మాత్రమే పరిమితం కాదని పునరుద్ఘాటించాడు. చివరి టెస్టు జరిగే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోనూ ఫలితం తేలే విధంగానే పిచ్ ఉండాలని తాను కోరుతున్నట్టు చెప్పాడు. (చిత్రం) పిచ్‌ల్లో లోపాలు లేవని, సమస్య బ్యాట్స్‌మెన్‌దేనని మాట మార్చేసిన రవి శాస్ర్తి