జాతీయ వార్తలు

రాయ్‌గఢ్ పోలీసుల తీరుపై నివేదికకు మహారాష్ట్ర ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షీనా బోరా కేసు

ముంబయి, నవంబర్ 21: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును రాయ్‌గఢ్ పోలీసులు నీరుగార్చారన్న ఆరోపణలపై తాజా నివేదిక సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డిజిపి ప్రవీణ్ దీక్షిత్‌ను ఆదేశించింది. ఈ కేసులో ఇంతకుముందు మాజీ డిజిపి సంజీవ్ దయాళ్ ‘ఒకే ఒక్క పేజీ’తో సమర్పించిన నివేదిక ‘అసంతృప్తికరం’గా ఉందని పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాయ్‌గఢ్ జిల్లా పెన్ తాలూకాలోని అటవీ ప్రాంతంలో 2012 మార్చి 23వ తేదీన తొలిసారి షీనా బోరా మృతదేహాన్ని గుర్తించినప్పుడు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను లేదా ఎడిఆర్ (యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు)ను నమోదు చేయకపోవడంపై దర్యాప్తు నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ‘ఈ కేసులో ఇంతకుముందు డిజిపి (దయాళ్) ఒకే ఒక్క పేజీతో మాకు నివేదిక సమర్పించారు. అయితే అది సంతృప్తికరంగా లేకపోవడంతో ఒక సీనియర్ పోలీసు అధికారిపై చర్య తీసుకునేందుకు వీలుగా సంబంధిత ఇతర పత్రాలను కూడా సమర్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశా’ అని మహారాష్ట్ర హోం శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కెపి.్భక్షి పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన తాజా నివేదికను, సంబంధిత పత్రాలను సమర్పించే బాధ్యతను కొత్త డిజిపి ప్రవీణ్ దీక్షిత్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
పీటర్‌పై అభియోగాలు దిగ్భ్రాంతికరం
షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాపై నమోదు చేసిన అభియోగాలు దిగ్భ్రాంతికరమైనవిగానూ, పరువు తీసేవిగానూ ఉన్నాయని ఆయన కుమారుడు రాహుల్ ముఖర్జియా అన్నాడు. గత రాత్రంతా దక్షిణ ముంబయిలోని సిబిఐ కార్యాలయంలోనే ఉన్న రాహుల్ ముఖర్జియా శనివారం ఉదయం అక్కడి నుంచి బయటికి వస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.