శ్రీకాకుళం

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం ఆర్డీవో విచారణ
ఎల్‌ఎన్‌పేట, డిసెంబర్ 22: నకిలీ పాసు పుస్తకాలతో బినామీ రైతులు వ్యవసాయ రుణాలు పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం ఆర్డీవో బి.దయానిది విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దారు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ముంగిన్నపాడు రెవెన్యూ పరిధిలో భూములు లేని వారి నకిలీ పాసు పుస్తకాలతో వ్యవసాయ రుణాలు పొందినట్టు గ్రామానికి చెందిన రావాడ త్రినాథరావు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు విచారణ చేస్తున్నట్టు ఆర్డీవో వెల్లడించారు. బినామీ రైతులు ఎల్‌ఎన్ పేట పిఎసిఎస్ పరిధి ఎపిజివిబి బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు పొందినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన రికార్డులను స్థానిక తహశీల్దారు కార్యాలయంలో పరిశీలించినట్టు తెలిపారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించనున్నట్టు ఆర్డీవో పేర్కొన్నారు. ఈ విచారణలో తహశీల్దారు రమణమూర్తి ఉన్నారు.

గణిత శాస్త్రం జీవితంలో ఒక భాగం
ఎచ్చెర్ల, డిసెంబర్ 22: మనిషి జీవితంలో గణిత శాస్త్రం ఓ భాగమని శ్రీ శివానీ ఎడ్యుకేషన్ సొసైటీ కోశాధికారి దుప్పల వెంకటరావు స్పష్టంచేశారు. మంగళవారం చిలకపాలెం కూడలిలో ఉన్న శివాని ఇంజినీరింగ్ కళాశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనువాసరామానుజన్ 128వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ మ్యాథ్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులకు శతశాతం మార్కులు గణితశాస్త్రంలోనే వస్తాయన్నారు. అలాగే జ్ఞాపక శక్తి మరింత పెరుగుతుందన్నారు. ఇటువంటి సబ్జెక్ట్‌పై ఇంజినీరింగ్ విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రిన్సిపల్ మురళీకృష్ణ మాట్లాడుతూ రామానుజం సామాన్య కుటుంబం నుండి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం చదువుకొని గణిత శాస్త్రానికి పితామహుడుగా నిలిచారన్నారు. ఈయనను స్ఫూర్తిగా విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. అకడమిక్ డైరెక్టర్ ఎల్‌ఎస్ శాస్ర్తి మాట్లాడుతూ సృజనాత్మకత అవసరమన్నారు. మేథమెటిక్స్‌లో ఫండమెంటల్స్‌పై పట్టు సాధిస్తేలక్ష్య సాధన సులువౌతుందన్నారు. హెచ్‌వోడి కృష్ణారావు, కన్వీనర్ లక్ష్మణ, కో కన్వీనర్ రమణమూర్తి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఘనంగా కుంకుమార్చనలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 22: మండలంలోని కుంచాలకూర్మయ్యపేట సమీపంలో ఉన్న దేవీ ఆశ్రమంలో కోటి కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా మంగళవారం 1500 సువాసినీలు ఐదుసహస్త్రాల కుంకుమార్చలను దేవీ ఉపాసకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ(బాలుస్వామి) జరిపించారు. అలాగే యాగశాలలో చంఢీ హోమం, నవగ్రహ మండపారాధన, లలిత పారాయణాలు నిర్వహించారు. మూల విరాట్టులకు రుత్వికులు ప్రత్యేక పూజలు జరిపారు. వచ్చే ఏడాది నవకోటి కుంకుమార్చన నిర్వహించనున్నట్టు బాలుస్వామి వెల్లడించారు. శుక్రవారం పౌర్ణమిని పురష్కరించుకొని లక్ష చామంతులతో రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు. కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

ఉద్యానవన పంటలపై
దృష్టి సారించాలి
రణస్థలం, డిసెంబర్ 22: ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో రైతులు పెంచుతున్న కొబ్బరి మొక్కలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందవచ్చునన్నారు. ప్రధానంగా ఉద్యానవన పంటల వలన కుటుంబ ఆదాయ వనరులుగా ఉపయోగపడతాయన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందజేసిన ఈ మొక్కలను పర్యవేక్షించాలని అధికారులను అదేశించారు. ఆయన వెంట ఎంపిడివో, ఏపి ఎం త్రినాథరావు పాల్గొన్నారు.

మీ భూమి అర్జీలు పరిష్కారం
ఎచ్చెర్ల, డిసెంబర్ 22: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రెండు విడతల మీ ఇంటికి మీభూమి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పూర్తిస్థాయిలో పరిష్కరించామని తహశీల్దార్ బి.వెంకటరావు తెలిపారు. మొదటి విడత మీ భూమి కార్యక్రమంలో 1744 అర్జీలు అందాయని ఇందులో 563 రెవెన్యూ పరమైన అంశాలు పరిష్కరించామన్నారు. రెండో విడత సమస్యలను కూడా పరిష్కరించినట్టు తెలిపారు. ఈ పాస్ పుస్తకం పొందిన రైతులు టైటిల్ డీడ్‌ను పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటే ఆర్డీవో జారీ చేస్తారని వివరించారు. మండలంలోని 1.25లక్షల పై చిలుక సబ్ డివిజన్లు ఉండగా 70 శాతం ఈక్రాఫ్‌ను పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ విధానం వల్ల రైతులు నష్టపోయినట్లయితే పంటల బీమా, నష్టపరిహారం ప్రభుత్వపరంగా పొందేందుకు మరింత పారదర్శకత ఉంటుందన్నారు. మిగిలిన ఈ క్రాఫ్‌ను కూడా సత్వరంగా పూర్తిచేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.

కళాశాల ఆవరణలో
మొక్కల పెంపకం
సారవకోట, డిసెంబర్ 22: స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కల పెంపకం కార్యక్రమం చేపట్టినట్టు ప్రిన్సిపల్ చౌదరి తెలిపారు.
ఈ మేరకు మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చోడసముద్రం గ్రామానికి చెందిన వరుదు రాంబాబు ఉచితంగా అందజేసిన మామిడి మొక్కలను ఆయన నాటారు.

విపత్తులపై అప్రమత్తత అవసరం
ఎచ్చెర్ల, డిసెంబర్ 22: ప్రకృతి విపత్తుల హెచ్చరికలను తెలుసుకుని, సముద్ర తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేసినట్లయితే ధన, ప్రాణ నష్టాన్ని నివారించగలమని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంజీవయ్య అన్నారు.
స్థానిక టిటిడిసిలో కలెక్టరేట్ సిబ్బందికి ప్రకృతి విపత్తులు ఎదుర్కొవడం ఎలా అనే అంశంపై మంగళవారం నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తుపానులు సునామీలు, వరదలు వంటి విపత్తులు సంభవించేటప్పుడు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి అక్కడ బాధిత కుటుంబాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు వేగవంతం చేయాలన్నారు. జాతీయ విపత్తుల ఎదుర్కొనడంలో నిపుణులుగా ఉన్నవారితో శిక్షణ పొందిన దళాలలను రంగంలోనికి దింపాలన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న సమగ్రసమాచారాన్ని సమీపంలో ఉంచుకొని ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టినట్లయితే విపత్తులు ఎదుర్కోవడం మరింత సునాయాసవౌతుందన్నారు.
మాక్‌డ్రిల్, లైఫ్‌జాకెట్ల వినియోగం, క్షతగాత్రులకు ప్రథమ చికిత్సవంటి అంశాలపై సిబ్బంది మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు ఉన్నారు.