క్రైమ్/లీగల్

శిశువిహార్‌లో ఆరునెలల పసికందు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: వెంగళరావునగరంలోని రాష్ట్ర శిశువిహార్‌లో ఆరునెలల చిన్నారి ఆదివారం రాత్రి మృతిచెందింది. శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇం దుకు కారణమని బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... గత ఆరు నెలల క్రితం నగరంలోని ఓ ప్రాంతలో చిన్నారిని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని తీసుకువచ్చి శిశువిహార్‌లో చేర్చారు. ఇక్కడి అధికారులు ఆ చిన్నారికి అద్వైత అని నామకరణం చేశారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి స్టేట్‌హోంలో పనిచేసే ఆయాలకు పాపకు పాలు పటిస్తుండగా విరోచనం చేసుకుంది. అనంతరం వాంతులు చేసుకొని అపస్మారక స్థి తికి వెళ్లిపోయింది. దీంతో ఆయాలు హుటాహుటిన చిన్నారని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. పాప గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, అదే క్రమంలో ఇది జరిగి ఉండవచ్చునని శిశువిహార్ అధికారులు పేర్కొంటున్నారు. బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని ఎస్సై వీరాస్వామి తెలిపారు.