రంగారెడ్డి

మంచి పనులతోనే సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 21: మంచి పనులతోనే మానవ జన్మకు సార్థకత అనేది లభిస్తోందని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. బుధవారం పట్టణంలోని ఠాగూర్ ఉన్నత పాఠశాల అడిటోరియంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీరామాయణ తరంగిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాల్గవ రోజున శ్రీరామాయణ తరంగిణి కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై ప్రవచనాలు చేశారు. చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ సమాజ అభివృద్ధితోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వచ్చే పేరుతోనే మానవజన్మకు నిజమైన స్వార్థకత లభిస్తుందని అన్నారు. మనిషిని ముందుకు నడిపిస్తుందంటే అది భగవంతుడేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు. సృష్టిలోని ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడని, పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో..ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదని అన్నారు. మనిషి జీవితం యంత్రం లాంటిదని, మనిషిని ముందుకు నడిపించేదే భగవంతుడని పేర్కొన్నారు. కళ్లు, ముక్కు, చేతులు, కాళ్లు ఇలా అనేక యంత్రాలు మనిషి జీవిత చక్రాన్ని నడిపిస్తాయని ప్రజలకు ఉద్భోదించారు. జ్ఞానాన్ని కలిగించి సుఖాన్ని ఇచ్చేదే జ్ఞానేంద్రియాలని, ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని, ఆ దేవుడే మనిషి లోపల ఉన్న జీవనాడులను క్రమం తప్పకుండా నడిపిస్తుంటాడని పేర్కొన్నారు. ఏదైనా సాధించాలనే ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెట్టాలని, తద్వారా విజయాలు లభిస్తాయని అన్నారు. ప్రతి మనిషికి లోపం అనేది ఉంటుందని, దానికి దీపాన్ని వెలిగిస్తే జీవితం వెలుగులతో నిండుతుందని అన్నారు. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు అధిగమిస్తూ ముందుకు సాగినప్పుడే విజయాలు సాధించగలరని పేర్కొన్నారు. సమాజంలో మంచి పనులు చేస్తూ ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లే విధంగా ఉండాలని, స్వర్గంలో దేవుళ్లు మనుషులపై ఆధారడి ఉంటారని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ, సుఖ దుఃఖాలతో ముందుకు సాగుతూ జీవనం కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు బండారి రమేష్, నక్క నర్సింలు, హారీష్ శర్మ, ప్రవీణ్ కుమార్, వాడకడ్టు విజయ్ కుమార్, విశ్వనాథ్, ఒగ్గు కిశోర్, మురళీ, సాకేత్ ప్రవీణ్, ఎల్.శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

రైతులకు సాగునీరు అందిస్తేనే అభివృద్ధి
దౌల్తాబాద్, మార్చి 21 : రైతులకు సాగునీరు అందిస్తెనే కోడంగల్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యపడుతుందని టీజేఏసీ చైర్మన్ అంగడిరైచూర్ కిష్టప్ప అన్నారు. బుధవారం మండల పరిధిలోని నర్సపూర్ గ్రామంలో పర్యటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిష్టప్ప మాట్లడుతూ ఏంతో కష్టపడి సాధించిన తెలంగాణ, కోడంగల్ అబివృద్ధికి నోచుకొవడం లెదన్నారు. ప్రదానంగా రైతులు కందిపంటను పండించిన తగిన గిట్టుబాటు ధరలెక తీవ్రంగా నష్టపొతున్నారు. అందుబాటులో మార్కెట్ సౌకర్యం లెక సుదూర ప్రాంతాలకు తరలించడం చాల దారుణమని అన్నారు. నారాయణపేట - కొడంగల్ ఏత్తిపోతల పథకం చేపడితెనే ఈప్రాంత అభివృద్ధి జరిగెందుకు ఆస్కారం ఉందని అన్నారు. టీజేఏసీ గ్రామగౌరవ చెర్మన్ గా జి, మల్లెష్ చెర్మన్‌గా అంజనెయులు కన్వీనర్‌గా శ్రీశైలం కోఅర్డినెటర్‌గా అంజనేయులు అధకారప్రతినిధి మాదవులు కోచెర్మన్‌లుగా నరెష్ ,నగేష్ అశోక్ శ్రీను రాములు కోకన్వీనర్‌లుగా పాండు వెంకటప్ప అశోక్ మహెష్ ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు. కార్యక్రమంలో మండల టీజేఏసీ చెర్మన్ పులీందర్‌గౌడ్, కౌడిడ్ సాయి లు మునీందర్‌గౌడ్ పాల్గొన్నారు.

రూ. 51లక్షల విలువైన పాన్ మసాలాలు స్వాధీనం
గచ్చిబౌలి, మార్చి 21: ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పాన్ మసాలాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. నిషేధించిన పాన్ మసాలాలను విక్రయించి డబ్బు సంపాదించాలని కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కతున్నారు. సొంతనికి వాడుకొనే ఖరీదైన కార్లలో కర్ణాటక నుంచి పాన్ మసాలాలను తీసుకొచ్చి కిరాణ దుకాణాలలో విక్రయిస్తున్న 19 మందిని శంషాబాద్, మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులతో పాటు చందానగర్, ఆర్‌సీపురం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. కర్ణాటకలో నిషేధం లేకపోవడంతో కొందరు వ్యాపారులు అక్కడ నుంచి పాన్ మసాలాలను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. 2006 ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం నిందితులను అరెస్టు కేసులు పెడుతున్నా వీరిలో ఎలాంటి మార్పు రావడంలేదు. గడచిన ఏడాది కాలంలో సైబరాబాద్ పోలీసులు రూ. 2కోట్లకుపైగా విలువైన గుట్కా, పాన్ మసాలాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులపైన కేసులు పెట్టారు. కర్ణాటక నుంచి భారీ స్థాయిలో నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు నగరానికి వస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు చందానగర్, రామచంద్రాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని పాత ముంబాయి జాతీయ రహదారిపై మాటువేశారు. 11 వాహనాలను అదుపులోకి తీసుకుని పరిశీలించగా అందులో రూ.50లక్షల విలువ చేసే పాన్ మసాలాలు, గుట్కా కాటన్లు దొరికాయి. తెల్లవారుఝామునైతే పోలీసుల నిఘా తక్కువ ఉంటుందని రాత్రి కర్ణాటక నుంచి బయలుదేరి ఉదయానికి నగరానికి రవాణా చేస్తున్నారు. మీరజ్, మీరజ్ స్మాల్, సాగర్, ఆర్‌ఆర్ జర్ధా, ఆర్‌ఆర్ మసాల, అంబర్, విమల్, స్వాగత్, చైనీ ఖైనీలు, బాబా బ్లాక్ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ (32), అనిల్ (25), రాకేష్ (25), సోమా రమేష్ (34) , మురంశెట్టి రమేష్ (47), మహ్మద్ షఖీల్ (47), అంజద్ అలీ (52), గౌస్ (31), అంజద్ (19), అబ్దు ల్ సిమీ (30), ఇర్ఫాన్ పాషా (25), జా వేద్ (30), షేక్ షారూఖ్ (20), భరత్ (24), సయ్యద్ సలీమ్ (22), సమీర్ (22), ఫైజుద్దీన్ (28), ఖాన్ (28), దినేష్ కు మార్ (38) లను అరెస్టు చేశారు. వీరందరు నగరంతో పాటు తెలంగాణలోని పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, బీద ర్ తదితర ప్రాంతాల వాసులు. కర్ణాటక నుంచి గుట్కాలను పాన్ మసాలను తీసుకొచ్చి రాష్ట్రంలోని చిల్లర, కిరాణ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అశోక్ లేలాండ్, స్కోడా, ఐ 20, స్విప్టు డిజైర్ (ఐదు వాహనాలు), ఇన్నోవా, ఓపెల్, బొలేరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఓటీ బృందాలతోపాటు స్థానిక పోలీసులను డీసీపీ అభినందించారు. ఎస్‌ఓటీ అదనపు డీసీపీ దయానంద్ రెడ్డి, ఎస్‌ఓటీ సీఐలు పురుషోత్తమం, ప్రవీణ్, చందానగర్ సీఐ తిరుపతి రావు, రామచంద్రపురం సీఐ రామచంద్ర రావు, సిబ్బందిని అభినందించారు.