రంగారెడ్డి

విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 23: విద్యారంగాన్ని అభివృద్ధి పరిచి అందరికీ నాణ్యత కలిగిన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీనగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఇటీవల బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టర్ బీ.ప్రకాష్ దత్తత తీసుకుని పోచారం ఇన్ఫోసీస్ సంస్థ సహకారంతో సీఎస్‌ఆర్ నిధులు రూ.22లక్షలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనుబంధ గ్రామం బొక్కోనిగూడలో రూ.10లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన జరిపారు. నియోజవర్గరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపట్టీ అన్ని రకాల వౌలిక సదుపాయాలకు కల్పించినట్లు చెప్పారు. ఘట్‌కేసర్ మండలంలో బోడుప్పల్, పిర్జాదీగూడలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఎన్‌ఎఫ్‌సీనగర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి సహకరించిన ఇన్ఫోసీస్ కంపెనీ యజమాన్యాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశంసించారు. విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాతను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధులు వెంకటేశ్వర్‌రావు, వినోద్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అప్పిలేట్ అథారిటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, కీసరగుట్ట ఆలయ కమిటీ డైరక్టర్ తరిణే మహింద్రాచారి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొంతం అంజి రెడ్డి, ఎంపీడీవో అరుణ, ఈవోపీఆర్‌డీ సునంద, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్ రెడ్డి, ప్రధానకార్యదర్శి కందుల కుమార్, ఎంపీటీసీలు జంపాల రమేశ్, మంకం రవి, పంచాయతీ సభ్యులు కొమ్మగోని రమాదేవి, విమల, కనకదుర్గ, లక్ష్మమ్మ, శ్రీకాంత్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
* ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు బాలగోపాల్
షాద్‌నగర్, ఏప్రిల్ 23: దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు బాలగోపాల్ అన్నా రు. సోమవారం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని హాజిపల్లి రోడ్డులో ని శ్రీవీరాంజనేయ భవాని సాహస్ర లింగేశ్వర దేవాలయానికి స్థానిక వ్యాపార వేత్త పలబట్ల పాండురంగం, పలబట్ల వెంకటమణి దంపతులు.. ఆలయ అభివృద్ధి కొరకు సామాజిక సేవలో భాగంగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. దేవాల యం అవరణలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో రెండు లక్షల రూపాయల నగదును అందజేశారు. ఈ నగదుతో దేవాలయం ఆవరణలో భక్తుల సౌకర్యార్ధం షెడ్ నిర్మించనున్నట్లు సభ్యులు తెలిపారు. దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులైతేనే ఆలయం అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉం టాయని పేర్కొన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యా లు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యు లు తెలిపారు. దేవాలయంలో పూజారి చంద్రశేఖరశర్మ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పలబట్ల శివకుమార్, పలబట్ల సతీష్, పలబట్ల ఆనంద్, ఆలయ కమిటీ సభ్యులు శంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భాస్కర్, సోమేష్, నర్సింహా రెడ్డి, భగవంత్ రెడ్డి పాల్గొన్నారు.