క్రీడాభూమి

రికార్డు బ్యాటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: పాక్‌తో జరిగిన నాలుగో వనే్డలో ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ బట్లర్ బ్యాటింగ్ రికార్డులు సృష్టించింది. కేవలం 46 బంతుల్లోనే అతను శతకాన్ని పూర్తి చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది మూడో శతకం. వనే్డల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. 25వ ఓవర్ దాటిన తర్వాత బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించడం బట్లర్‌కు ఇది రెండోసారి. ఇంతకు ముందు లార్డ్స్ మైదానంలో 29వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 74 బంతుల్లో 121 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌లో 36వ ఓవర్‌లో క్రీజ్‌లో దిగాడు. వనే్డల్లో 25వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి, ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు విరాట్ కోహ్లీ పేరుమీద ఉంది. అతు ఐదు పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు.