క్రీడాభూమి

ప్రమాదంలో సఫారీల రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 24: గత తొమ్మిదేళ్లలో విదేశాల్లో 14 సిరీస్‌లు ఆడి, పది విజయాలను నమోదు చేసిన దక్షిణాఫ్రికా టెస్టు రికార్డు ప్రమాదంలో పడింది. భారత్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో గెలిస్తేనే ఆ జట్టు టెస్టు సిరీస్‌లో నిలబడుతుంది. 2006లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఎదురైన పరాజయం తర్వాత, ఇప్పటి వరకూ విదేశాల్లో దక్షిణాఫ్రికా ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. ఆ జట్టు సాధించిన సిరీస్ విజయాల్లో రెండు ఆస్ట్రేలియాపై నమోదు చేసినవి. 2008-09 సీజన్‌లో ఒకసారి, 2012-13 సీజన్‌లో మరోసారి ఆస్ట్రేలియాకు వెళ్లిన సఫారీలు కంగారూలను ఓడించారు. ఇంగ్లాండ్ (2008), వెస్టిండీస్ (2010), న్యూజిలాండ్ (2012), పాకిస్తాన్ (2008), శ్రీలంక (2014), బంగ్లాదేశ్ (2008), జింబాబ్వే (2008) జట్లపై ఒక్కో విజయాన్ని సాధించింది. అయితే, ఈ సిరీస్‌కు ముందు భారత్ పర్యటనకు దక్షిణాఫ్రికా రెండు పర్యాయాలు వచ్చింది. 2007-08, 2009-10 సీజన్లలో భారత్‌కు వచ్చి, సిరీస్‌ను 1-1గా డ్రా చేసుకుంది. ఈసారి మొదటి టెస్టులో పరాజయాన్ని ఎదుర్కొని 0-1 తేడాతో వెనకబడింది. రెండో టెస్టులో నాలుగు రోజుల ఆట వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడో టెస్టు బుధవారం నుంచి ఆరంభం కానుండగా, విదేశాల్లో ఓటమి ఎరుగని రికార్డును దక్షిణాఫ్రికా కొనసాగిస్తుందా అన్న అనుమానం తలెత్తుతోంది. మొత్తం ఐదు పర్యాయాలు భారత్‌లో పర్యటించిన దక్షిణాఫ్రికా ఒకేసారి సిరీస్‌ను కైవసం చేకుంది. 1999-2000 సీజన్‌లో హన్సీ క్రానే నాయకత్వంలో భారత్‌పై సిరీస్‌ను సంపాదించింది. ఈ టూర్ సందర్భంగానే యావత్ క్రికెట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం బయటపడింది.