నల్గొండ

రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, నవంబర్ 29: హుజూర్‌నగర్ పట్టణ శివారులోని మఠంపల్లి బైపాస్‌లో పట్టణ పోలీసులు ఆదివారం 20 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకొన్నారు. వివరాలను యస్‌ఐ రంజిత్‌రెడ్డి పత్రికలకు వెల్లడించారు. మఠంపల్లి బైపాస్‌లో వాహానాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడినట్లు ఆయన చెప్పారు. దుంగలను రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామానికి చెందిన దాయం బ్రహ్మారెడ్డి తన మామిడితోటలో ఎర్రచందనం మొక్కలను పెంచుతున్నాడని ఆయన చెప్పారు. గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల సాయంతో శనివారం రాత్రి ఎర్రచందనం దుంగలను నరికి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న క్రమంలో హుజూర్‌నగర్ పోలీసులకు వాహానాల తనిఖీలో దుంగలు పట్టుపడ్డాయి. వీటి విలువ 20 లక్షలు వుంటుందని యస్ ఐ రంజిత్‌రెడ్డి చెప్పారు. బ్రహ్మరెడ్డి పరారీలో వుండగా కొండల్, నాగులు, నాగుల్‌మీరా, నరేష్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి హుజూర్‌నగర్ యస్‌ఐ రంజిత్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకొన్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.