కర్నూల్

రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పోలీసుల అదుపులో ఇద్దరు తమిళ కూలీలు
రుద్రవరం, నవంబర్ 29: నల్లమల అటవీ ప్రాంతంలోని పెద్దవంగలి కప్పకలకుంట ప్రాంతంలో 51 ఎర్రచంద నం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు రేంజర్ రామ్‌సింగ్ తెలిపారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమిళనాడుకు చెం దిన ఎర్రచందనం కూలీలు నల్లమల ప్రాంతంలో సంచరిస్తున్నారన్న అనుమానంలో గాలింపు చేపట్టామన్నారు. అందులో భాగంగా సేలం జిల్లాకు చెం దిన ఎర్రచందనం కూలీలు అడిమెడి చిన్నంబి, నడిందరి ఆండేలను అదుపులోకి తీసుకోగా, మరికొందరు పారిపోయారని, వారి కోసం వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ కూలీల ను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరిచామన్నారు. అలాగే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను రుద్రవరం ఫారెస్టు కార్యాలయానికి తరలించామన్నారు. వీటి విలువ రూ. కోటి ఉంటుందన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారి విజయలక్ష్మి, బీట్ అధికారి పెద్దన్న, ప్రొటక్షన్‌వాచర్లు పాల్గొన్నారు.
పశువైద్యుల కొరత!
* అటెండర్లతోనే సేవలు
ఆదోనిటౌన్, నవంబర్ 29: పశువుల వైద్యానికి వైద్యులు, కాంపౌండర్ల కొరత ఏర్పడింది. దీంతో మండలంలోని ఆయా పశువైద్యశాలల్లో అటెండర్లే వైద్యులుగా అవతారం ఎత్తి పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు సైతం వారితోనే పశువులకు చికిత్సలు చేయిస్తున్నారు. ఆదోని మండలంలోని 37 గ్రామ పంచాయతీలకుగాను 25 వేల ఎద్దులు, ఆవులు, 12,833 గేదలు, 15,744 గొర్రెలు, 25,785 మేకల పశుసంతతి ఉన్నట్లు పశువైద్యాధికారులు వివరించారు. దీనికిగాను మండలంలోని ఆదోని కేంద్రంగా ప్రధాన ఆసుపత్రిలో పశువైద్యానికి ఎడితోపాటు కాంపౌండర్, అటెండర్ల పోస్టు లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీరు పట్టణంలోని పశుసంతతికి వైద్య చికిత్సలు అందించాల్సి ఉంది. ఇక్కడ మూడు పోస్టుల్లో కూడా పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నారు. అయితే గ్రామాల్లో ఉన్న పశువైద్యశాలకు, అదనపు పశువైద్యశాలకు వైద్యులు, కాంపౌండర్ల, అటెండర్ల కొరత ఉంది. మండలంలోని మదిరే, పెద్దహరివాణం, పెద్దతుంబళం గ్రామాల్లో ప్రధాన పశువైద్యశాలలు ఉన్నాయి. మదిరేలో డాక్టర్, కాంపౌండర్, అటెండర్ పోస్టులకుగాను కాంపౌండర్ పోస్టు ఖాళీగా ఉంది. అలాగే నాగనాథనహళ్ళి, సంతేకూడ్లూరు, బసాపురం, విపాపురం, బైచిగేరి, పెద్దతుంబళం, ఇస్వీ గ్రామాల్లో సైతం కాంపౌండర్ల కొరత ఉండడంతో అక్కడ అటెండర్లే పశువులకు వైద్య చికిత్స చేస్తున్నారు. అలాగే బసరకోడు, ఇస్వీ, పెసులబండలో కాంపౌండర్ల పోస్టుల ఖాళీగా ఉన్నాయి. అటెండర్లతో వైద్యసేవలు పొందుతున్న గ్రామాలకు అటెండర్లు వెళ్లకపోతే ఆ పశువైద్యశాలకు తాళం తప్పదు. మండలంలోని 46 గ్రామాల్లో పశువులకు వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదు. పశువులు తీవ్ర అస్వస్థతకు గురైతే ఆదోనికి తరలించాల్సింది. లేని పక్షంలో పశువులకు మృత్యువాత తప్పదు. మరో పక్క గ్రామాల్లో పశువైద్యానికి ప్రభుత్వం నియమించిన గోపాలమిత్రులు సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. మండలంలోని ఆరేకల్లు, చిన్నహరివాణం, చిన్నపెండేకల్లు, సాంబగల్లు, జీవసల్లి, జాలిమంచి, పాండవగల్లు, దిబ్బనకల్లు, గోనబావి గ్రామాల్లో ఉన్న గోపాలమిత్రులు సైతం తమ వంతుగా పశువులకు వైద్య చికిత్సలు చేస్తున్నారు. అయితే వీరికి రైతులు కొంత వరకు వైద్యసేవలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మండలంలో ఆయా వైద్యశాలలో ఖాళీగా ఉన్న వైద్యులు, కాంపౌండర్ల,అటెండర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
మహానందిలో భక్తుల పూజలు
మహానంది, నవంబర్ 29: మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. కార్తీకమాసంలో మూడ వ ఆదివారం కావడంతో భక్తులు మహానంది క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని పూల కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీకామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి వుండి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. అలంకార మండపంలో వేదపండితులు సామూహిక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇఓ డాక్టర్ శంకర వరప్రసాద్, ఎఇఓ మధు, పర్యవేక్షకులు, ఇన్‌స్పెక్టర్ మల్లయ్య, నాగభూషణం ఏర్పాట్లు చేశారు.