రాష్ట్రీయం

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై 2,327 కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

42 మంది స్మగ్లర్ల అరెస్టు * శాసనసభకు వెల్లడించిన అటవీశాఖ మంత్రి

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి 2,327 కేసులు నమోదు చేశామని, వీటికి సంబంధించి న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలను దాఖలు చేశామని, ఇవి వివిధ దశల్లో విచారణలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జ గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం శాసనసభలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సభ్యులకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు 42 మంది పేరు మోసిన ఎర్ర చందనం అక్రమ రవాణాదారులను అరెస్టు చేసి పిడి చట్టంలోని నిబంధనలను అమలు చేశామన్నారు.
కాగా, ఓడరేవుల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శాసనసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఓడరేవులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునే ఆలోచన ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఓడరేవు, శ్రీకాకుళం జిల్లాలోని భావనంపాడు ఓడరేవును త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 3.25 లక్షల మందికి పించన్లను మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని అసెంబ్లీలో తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు 1.5 లక్షలు, సెప్టెంబర్ వరకు 1.75 లక్షలు కలిపి మొత్తం 3.25 లక్షల మందికి కొత్తగా సామాజిక భద్రత కింద పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు.