రాష్ట్రీయం

శేషాచలంలో గాలిలోకి కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసులకు ఎదురైన ఎర్ర చందనం కూలీలు ముగ్గురు అరెస్టు
చంద్రగిరి, డిసెంబర్ 26: తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో సుమారు 40 మంది ఎర్రచందనం కూలీలు దుంగలు మోసుకొస్తూ కూంబింగ్ సిబ్బంది కంటపడగా గాలిలోకి కాల్పులు జరిపారని తిరుపతి డిఎస్‌పి శ్రీనివాసులు తెలిపారు. ఈసందర్భంగా 33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి శేషాచలం అడవిలో ఎర్రగుంట వద్ద కూంబింగ్ సిబ్బంది ప్రత్యేక బెటాలియన్, బేస్ క్యాంపు సిబ్బంది గాలింపులు చేపట్టగా 40 మంది ఎర్రచందనం కూలీలు దుంగలను మోసుకొస్తూ ఎదురుపడ్డారని తెలిపారు. దీంతో ఎర్రచందనం కూలీలు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న రాళ్లతో అధికారులపై తిరగబడ్డారని చెప్పారు. సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి వారిని చుట్టుముట్టేలోపే కూలీలు ఎర్రచందనం దుంగలను అక్కడ పడవేసి వచ్చిన దారిలోనే తిరిగి అడవిలోకి పారిపోయారన్నారు. కాగా తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన చిన్నశేలం తాలూకాకు చెందిన రామ్మూర్తి(22), గోవిందరాజన్(30), అల్లిముత్తు (37) వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. డిఎఫ్‌ఓ విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ కూలీల్లో అల్లిముత్తుకు ఎడమకాలు గాయమైందని తెలిపారు.