బిజినెస్

‘నీరు’గారిన పారిశ్రామిక రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాట వర్షాలు, వరదలతో మనాలీ రిఫైనరీ మూసివేత
* ఆటోమొబైల్, ఐటి సంస్థల్లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
చెన్నై/న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తమిళనాడులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా నీరుగారుస్తున్నాయి. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనివిధంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సిపిసిఎల్) రాష్ట్ర రాజధాని సమీపంలో 10.5 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన మనాలీ చమురు శుద్ధి కర్మాగారాన్ని (రిఫైనరీని) మూసివేసింది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి)కు అనుబంధంగా పనిచేస్తున్న చెన్నై పెట్రోలియమ్ కార్పొరేషన్ వలన బుధవారం రాత్రి మనాలీ రిఫైనరీని మూసివేసిందని, భారీ వర్షాలు, వరదలే ఇందుకు కారణమని సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ రాయ్ తెలిపారు. అయితే నాగపట్టణంలో సిపిసిఎల్‌కు చెందిన మరో చిన్న రిఫైనరీ యధాతథంగా పనిచేస్తోంది. ఈ రిఫైనరీలో సంవత్సరానికి 10 లక్షల టన్నుల చమురును శుద్ధి చేస్తున్నారు.
ఇదిలావుంటే, భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నైలోని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో పాటు అక్కడికి సమీపంలోని ఒరగడంలో గల అపోలో టైర్స్ లిమిటెట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటితో అపోలో టైర్స్ ఫ్యాక్టరీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బుధవారం వరకు మూడు షిప్టుల్లో పనులకు అంతరాయం ఏర్పడిందని, దీంతో సుమారు 450 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నష్టం జరిగిందని, అయితే ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నష్టం నుంచి బయటపడేందుకు తమకు తగిన బీమా రక్షణ ఉందని ఆ సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజీకి తెలియజేసింది. కాగా, గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన తమ ఉద్యోగులతో పాటు కేంద్రాలకు, కార్యాలయాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో సరఫరాలకు విఘాతం కలిగిందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా గత నెలలో తమ సంస్థకు 4 వేల మోటార్ సైకిళ్ల ఉత్పత్తి నష్టం జరిగిందని, తాజాగా కురుస్తున్న వర్షాల వలన చెన్నైతో పాటు తిరువొత్తియూర్, ఒరగడం తదితర ప్రాంతాల్లో మంగళవారం నుంచి తమ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అలాగే భారీ వర్షాల వలన చెన్నై, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో హ్యుందాయ్, ఫోర్డ్, రేనాల్ట్ తదితర ఆటోమొబైల్ సంస్థలతో పాటు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటి ఐటి సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించాయి.
(చిత్రం) మనాలీ చమురు శుద్ధి కర్మాగారం (ఫైల్ ఫొటో)