నల్గొండ

బిల్యా రాజీనామాను తిరస్కరించిన చంద్రబాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ , డిసెంబర్ 22: టిడిపి జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్ తన పదవికి ఇటీవల చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు మంగళవారం తిరస్కరించారు. జిల్లా టిడిపి కమిటీని రద్దు చేయడంతో మనస్తాపం చెందడంతో పాటు ఉమామాధవరెడ్డి వర్గం వేధిస్తుందంటు బిల్యా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ సమస్యపై తాను అన్ని వర్గాలను కూర్చోబెట్టి చర్చించి పరిష్కరిస్తానని బిల్యా రాజీనామా అవసరం లేదంటూ ఆయనకు నచ్చచెప్పిన చంద్రబాబు బిల్యా రాజీనామాను తిరస్కరించినట్లుగా ప్రకటించారు.

రైల్వే ప్రయాణికులకుఅత్యున్నత భద్రత
భువనగిరి, డిసెంబర్ 22: రైల్వే సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ సుమతిశాండిల్య మంగళవారం భువనగిరి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లపై తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలుప్రయాణికులకు భద్రతకల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రయాణికులకు భద్రతాపరమైన సమస్యలు ఏర్పడితే 182టోల్‌ఫ్రీనంబర్‌కు ఫోన్‌చేయవచ్చని ఆయన తెలిపారు. తమబ్యాగులను రైలులో మరిచి స్టేషన్‌లో దిగిపోయినా, ఆకతాయిలు వేధించినా, దొంగతనాలు చోటుచేసుకున్నా 182టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఆన్నారు. భువనగిరి రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, ప్రయాణికులతో ఆర్పీఎఫ్ పోలీసుల పనితీరుపై ఆరాతీసారు. రైల్వేశాఖ చేపడుతున్న ప్రయాణికుల భద్రత అంశాలపట్ల ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ఇక్బాల్ అహ్మద్, ఎస్సై సురేష్‌లు ఉన్నారు.కరవుపై చర్చించేందుకు వెంటనే