క్రీడాభూమి

బాలుడికి చికిత్స కోసం.. ఒలింపిక్ పతకం అమ్మేశాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్సా (పొలాండ్‌) : పొలాండ్‌ డిస్కస్‌ త్రో ఆటగాడు పియోటర్‌ మలచోస్కీ రియో ఒలింపిక్స్‌ పోటీల్లో ఎంతో కష్టపడి సాధించిన రజత పతకాన్ని అమ్మేశాడు. కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స కోసం తన పతకాన్ని వేలానికి పెట్టాడు. మూడేళ్ల తన కుమారుడు కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని ఓ మహిళ నుంచి పియోటర్‌కు లేఖ వచ్చింది. బాలుడికి సహాయం చేసేందుకు పియోటర్‌ తన పతకాన్ని ఫేస్‌బుక్‌లో వేలానికి పెట్టాడు. ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే తన పతకం అమ్ముడుపోయిందని, ఆ డబ్బును చిన్నారి చికిత్స కోసం అందించనున్నట్లు పియోటర్‌ తెలిపాడు.