కృష్ణ

కల్తీ లిక్కర్ కేసులో మల్లాది విష్ణు అరెస్టుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా మల్లాది విష్ణు బార్‌లో మద్యం సేవించి అస్వస్థతకు గురై, ఐదుగురు మృతి చెందిన కల్తీ లిక్కర్ కేసు నగర కాంగ్రెస్ అధ్యక్షుని మెడకు చుట్టుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న విష్ణు కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఆయన హైదరాబాద్‌లో తల దాచుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. కాగా విష్ణు ఎన్నికల అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చిన పోలీసులు దాని ఆధారంగా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా స్వర్ణ బార్ లైసెన్స్‌దారుల్లో ఉన్నవారంతా విష్ణు కుటుంబ సభ్యులే. తల్లి, సోదరి, బావ ఇలా రక్తసంబంధీకులే ఉన్నారు. పైగా విష్ణు తల్లి మల్లాది బాల త్రిపుర సుందరమ్మ లైసెన్స్ దారుల జాబితాలో ఉండటం బట్టి చూస్తే విష్ణు బినామీగా భావిస్తున్నారు. దీంతో ఆమెను ప్రశ్నించేందుకు సిట్ బృందం అంతకుముందే నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో కృష్ణలంక స్టేషన్‌కు వచ్చిన సుందరమ్మను శనివారం సిట్ బృందం విచారించింది. సిట్ అధికారి మహేష్ చంద్ర లడ్హా పలు అంశాలపై ఆమెను ప్రశ్నించారు. ఇప్పటికే విష్ణు సోదరుడు శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో కల్తీ జరిగినట్లు బుల్లయ్య అంగీకరించాడు కూడా. పైగా మేనేజర్ వెంకటేశ్వరరావు కల్తీకి పాల్పడినట్లు నేర అంగీకార నమోదు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణు అరెస్టుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. రేపో మాపో విష్ణును సిట్ బృందం అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన మీదట అరెస్టు ప్రకటించే అవకాశం లేకపోలేదు.