క్రీడాభూమి

రెస్ట్ఫా ఇండియా సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిని ఓడించి ఇరానీ కప్ కైవసం
ముంబయి, మార్చి 10: డ్రాగా ముగియడం ఖాయంగా కనిపించిన మ్యాచ్‌ని రెస్ట్ఫా ఇండియా జట్టు గెల్చుకొని సంచలనం సృష్టించింది. ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ విజేత ముంబయిని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఓపెనర్ ఫైజల్ ఫజల్ సెంచరీ సాధించి రెస్ట్ఫా ఇండియాను విజయపథంలో నడిపించాడు. 480 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మ్యాచ్ నాలుగు రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 100 పరుగులు చేసిన రెస్ట్ఫా ఇండియా గురువారం ఉదయం ఆటను కొనసాగించి, 6 వికెట్లకు 482 పరుగులు చేసింది. ఫజల్ 127 పరుగులు సాధించగా, కరుణ్ నాయర్ (92), షెల్డన్ జాక్సన్ (59 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (54) అర్ధ శతకాలతో కదంతొక్కారు. శ్రీకర్ భరత్ 42 పరుగులు సాధించాడు. ముంబయి బౌలర్లలో ఇక్బాల్ అబ్దుల్లా 154 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి తొలి ఇన్నింగ్స్: 158.2 ఓవర్లలో 603 ఆలౌట్ (అఖిల్ హెర్వాద్కర్ 90, జై బిస్టా 104, శ్రేయాస్ అయ్యర్ 55, సూర్యకుమార్ యాదవ్ 156, ఆదిత్య తారే 65, సిద్దేష్ లాడ్ 46, జయంత్ జయాద్ 4/132, జైదేవ్ ఉనాద్కత్ 2/128, కృష్ణ దాస్ 2/152).
రెస్ట్ఫా ఇండియా తొలి ఇన్నింగ్స్: 99.5 ఓవర్లలో 306 ఆలౌట్ (కరుణ్ నాయర్ 94, జయంత్ యాదవ్ 46, జైదేవ్ ఉనాద్కత్ 48, అభిషేక్ నాయర్ 3/35, ఇక్బాల్ అబ్దుల్లా 2/62, జై బిస్టా 2/52).
ముంబయి రెండో ఇన్నింగ్స్: 51.2 ఓవర్లలో 182 ఆలౌట్ (సిద్దేష్ లాడ్ 60, సూర్యకుమార్ యాదవ్ 49, జై బిస్టా 38, జయదేవ్ యాదవ్ 4/93, జైదేవ్ ఉనాద్కత్ 3/16, స్టువర్ట్ బిన్నీ 2/45).
రెస్ట్ఫా ఇండియా రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 480): 129.4 ఓవర్లలో 6 వికెట్లకు 482 (ఫైజల్ ఫజల్ 127, శ్రీకర్ భరత్ 42, సుదీప్ చటర్జీ 54, కరుణ్ నాయర్ 92, షెల్డన్ జాక్సన్ 59 నాటౌట్, ఇక్బాల్ అబ్దుల్లా 5/154).